మెగాస్టార్లు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ అక్టోబర్ 5న వస్తోంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన చిత్రమిది. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ కి రీమేక్. ట్రైలర్ లో లూసిఫర్ స్క్రీన్ ప్లే నే ఫాలో అయినట్లు కనిపించింది. అయితే దర్శకుడు మోహన్ రాజా మాత్రం గాడ్ ఫాదర్ కోసం ఫ్రెష్ స్క్రీన్ ప్లే రాసుకున్నానని చెబుతున్నాడు.
”ధ్రువ -2 గురించి చర్చలు జరుపుతున్న సమయంలో లూసిఫర్ ప్రస్తావన వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడిగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ నాపేరుని సూచించారు. చరణ్, చిరంజీవిలకి నచ్చింది. ఫోన్ చేసి పిలిపించారు. వారిని కలిసే ముందే లూసిఫర్ ని చూశాను. అందులో నాకు ఒక కొత్త కోణం దొరికింది. అదే చిరంజీవి గారితో పంచుకున్నాను. ఆ కోణం చిరంజీవిగారికి చాలా నచ్చింది. ఇందులో హీరోతో పాటు మరో పది పాత్రలు కూడా గెలుస్తాయి. మలయాళంలో చూడనికి పది పాత్రలు ఇందులో వేరే రూపంలో వుంటాయి. ఈ పాత్రలు చాలా సర్ప్రైజింగా వుంటాయి. ఓపిక వుంటే లూసిఫర్ మరోసారి చూసి రండి” అంటున్నారు మోహన్ రాజా.