ఈమధ్య సుకుమార్ శిష్యుల హవా ఎక్కువైంది. బుచ్చిబాబు `ఉప్పెన`తో హిట్టు కొట్టాడు. `కుమారి 21 ఎఫ్` తీసిన… పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ శిష్యుడే. మరో ఇద్దరు శిష్యుల్ని కూడా త్వరలోనే దర్శకులుగా ప్రమోషన్ ఇప్పించాలనుకుంటున్నాడు సుక్కు. అందులో ఒకరు.. ఈమధ్య రానాకి కథ చెప్పాడట. ఆ కథ రానాకి కూడా నచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమానీ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లోనే తీసే అవకాశాలున్నాయి. ఇదో పిరియాడికల్ డ్రామా అని తెలుస్తోంది. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల సమయంలో జరిగే కథ అట. సుకుమార్ శిష్యులు తమ గురువు దారిలోనే ప్రేమకథలు, సెన్సిటీవ్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటుంటారు. కానీ ఈసారి మాత్రం రూటు మార్చినట్టు ఉన్నారు. మొత్తానికి సుకుమార్ నవతరం దర్శకులకు ఓ ఫ్యాక్టరీలా తయారైపోయాడు. ఈ బ్యాచ్ నుంచి ఇంకెంత మంది వస్తారో చూడాలి.