పూరిది మామూలు స్పీడు కాదు. సూపర్ ఫాస్ట్. పూరితో సినిమా అంటే హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా, హీరోలు మొగ్గు చూపించేది అందుకే. మిగిలిన స్టార్ డైరెక్టర్లంతా ఆరు నెలలు కథకు, యేడాది మేకింగ్, మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అంటూ సినిమాకు రెండేళ్లు తీసుకొంటారు. కానీ పూరి ఆరే ఆరు నెలలలో సినిమా తీసి చేతిలో పెట్టేస్తాడు. అదీ పూరీ మార్క్.
‘డబుల్ ఇస్మార్ట్’ తో పూరి మరోసారి ఇదే మ్యాజిక్ చేశాడు. సినిమా పట్టాలెక్కడానికి టైమ్ పట్టింది. మధ్యలో గ్యాప్ కూడా వచ్చింది. అది మినహాయిస్తే రెండంటే రెండు నెలలు, అంటే దాదాపు 50 వర్కింగ్ డేస్లో ఈ సినిమా పూర్తి చేసేశాడట పూరి. తన కెరీర్లో ఇదే సూపర్ ఫాస్ట్ సినిమా. రామ్ సెట్ కి వస్తే రెండు రోజుల్లో తీయాల్సిన సీన్లలన్నీ ఒక్క రోజులోనే పూర్తి చేసి పంపేవాడట. సంజయ్ దత్ ఇచ్చిన కాల్షీట్ల కంటే తక్కువ రోజుల్లోనే తన షెడ్యూల్ మొత్తం పూర్తి చేశాడట. సాధారణంగా యాక్షన్ సీన్లకు ఎక్కువ రోజులు టైమ్ తీసుకొంటారు. పూరి మాత్రం చాలా త్వరగానే యాక్షన్ పార్ట్ నీ ఫినిష్ చేశాడట. త్వరగా సినిమా వదిలేయాలి అనే తలంపుతోనో, లేదంటే, బడ్జెట్ పెరక్కూడదన్న జాగ్రత్తతోనో పూరి పని చేసి ఉంటాడు. అందుకే ఇంత ఫాస్ట్. అయితే క్వాలిటీ విషయంలో పూరి ఎక్కడా రాజీ పడలేదట. పూరి కెరీర్లో ఇంత క్వాలిటీతో సినిమా రాలేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది. లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటికే పూరి లాభాల్లోకి వచ్చేశాడు. దటీజ్ పూరి.