పూరి జగన్నాథ్ ఇప్పుడో సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట ఆయన సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాలు తీసుకుంటారని తెలుస్తోంది. వైష్ణో మూవీస్, పూరి కనెక్ట్స్ అనే రెండు బ్యానర్లున్నాయి పూరికి. పెద్ద సినిమాలు వైష్ణోలో, చిన్న సినిమాలు పూరి కనెక్ట్స్ లో తీస్తూ వస్తున్నారు. మెహబాబూ సొంత సినిమానే. ఆ సినిమా కోసం బాగా ఖర్చు పెట్టాడు పూరి. అందుకోసం సొంత ఇంటిని సైతం అమ్ముకోవాల్సివచ్చింది. ఆ సినిమా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లడం, మంచి లాభాలు రావడంతో పూరి ఉత్సాహంగా ఉన్నాడు. ఇక మీదట సొంత నిర్మాణ సంస్థలోనే సినిమాల్ని తీస్తానని చెబుతున్నాడు పూరి. ఇది వరకు వైష్ణో మూవీస్‌పై వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. ఆ సమయంలో `నా బ్యానర్లో సినిమాలు తీయను` అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాంటి పూరి.. ఇప్పుడు సొంత సినిమాలకే కట్టుబడిపోతున్నాడెందుకో? తనపై నిర్మాతలకు నమ్మకం సడలిందా? లేదంటే తనపై తనకి నమ్మకం బాగా పెరిగిందా?? ఒకవేళ బయటి నిర్మాణ సంస్థలు వచ్చినా.. తన పారితోషికం బదులుగా వాటా తీసుకుని… తన బ్యానర్ పేరు జోడిస్తాడేమో. మొత్తానికి పూరి నిర్ణయం పరిశ్రమని ఆశ్చర్యపరిచేదే.