ఎన్టీఆర్ స్క్రిప్టు బాలకృష్ణని నిద్రపోనివ్వకుండా చేస్తోంది. ఈ సినిమాకి తగిన దర్శకుడ్ని అన్వేషించడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల తేజతో సంప్రదింపులు జరిపినప్పటికీ, తేజని తీసుకోవాలా, వద్దా? అనే విషయంలో బాలయ్య ఇప్పటికీ ఓ క్లారిటీకి రాలేదని తెలుస్తోంది. తేజ కంటే… సమర్థులైన దర్శకుల జాబితా ఒకటి తయారు చేసి, వాళ్లందరినీ సంప్రదించే పనిలో ఉన్నాడట బాలయ్య. ఇటీవల ఓ తమిళ దర్శకుడితో సంప్రదింపులు జరిపార్ట. ఆయనకు క్లాసిక్ సినిమాల్ని అందించిన చరిత్ర ఉంది. ఇప్పుడు మాత్రం ఖాళీగానే ఉన్నా… ఎన్టీఆర్ బయోపిక్ చేయడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.
”ఆ పెద్దానయ గురించి నాకు ఏమాత్రం అవగాహన లేదు. ఆయన గురించి అణువణువు తెలిసిన దర్శకుడి చేతిలో ఈ సినిమా పెట్టడం మంచిది” అని సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. బాలయ్యకూ అదే సబబు అనిపించిందని సమాచారం. ఓ దశలో కె.రాఘవేంద్రరావు పేరూ పరిశీలనకు వచ్చిందని, అయితే.. ఆయన ఫామ్లో లేకపోవడం, ఆధ్యాత్మిక చిత్రాలవైపు గాలి మళ్లడంతో – రాఘవేంద్రరావు పేరుని పక్కన పెట్టారని తెలుస్తోంది. 2019 ఎన్నికలలోపు ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది బాలయ్య ఉద్దేశం. అందుకే ఇంత హడావుడి.