‘HIT’ ఫ్రాంచైజ్ తో రెండు విజయాలని అందుకున్నాడు దర్శకుడు శైలేష్ కొలను. ఇప్పుడు వెంకటేష్ తో ‘సైంధవ్’ సినిమా చేశాడు. ఇది వెంకీ 75వ చిత్రం. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకి పార్ట్ 2 చేసే ఆలోచన వుందని స్వయంగా చెప్పాడు దర్శకుడు.
”హిట్ 1 ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు కాబట్టి హిట్ 2 తీశాను. సైంధవ్ ని ప్రేక్షకులకు ఇష్టపడితే తప్పకుండా పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 చేసే అవకాశం వున్న కథ ఇది. ఈ కథ ముగింపు కూడా ఓపెనింగ్ ఎండింగ్ గానే డిజైన్ చేశాను. HIT లానే ఫ్రాంచైజ్ గా చేసే అవకాశం వున్న సినిమా ఇది. ఐతే అది ప్రేక్షకులు ఈ సినిమాకి ఇచ్చిన ఆదరణ బట్టి వుంటుంది” అని చెప్పాడు.
అలాగే నాని తో చేసే హిట్ 3 పై కూడా క్లారిటీ ఇచ్చాడు. ‘ఫ్రాంచైజ్ హిట్ అయ్యింది కాబట్టి ఏడాదికో సినిమా చేస్తే ప్రేక్షకుల ఆసక్తిపోతుంది. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ వుండాలి. హిట్ 3 రావడానికి ఏడాదిన్నర పట్టొచ్చు” అని వెల్లడించాడు శైలేష్.