శంకర్ ‘భారతీయుడు 2’ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ట్రైలర్లో విజువల్స్ అదిరాయి. ఈ సినిమాపై నమ్మకాన్ని కలిగించాయి. కమల్ హాసన్ రకరకాల గెటప్పుల్లో దర్శనమిచ్చాడు. కమల్ అభిమానులకు అది ఆనందాన్ని కలిగించింది. అయితే కొంతమంది మాత్రం శంకర్ ఈ సేనాపతి క్యారెక్టర్ ని ఇలా మలిచాడేంటి? అని ఆశ్చర్యపోతున్నారు. వెటకారం కూడా చేస్తున్నారు.
ఎందుకంటే ‘భారతీయుడు 2’లో సేనాపతి (కమల్‌హాసన్) వయసు 74 ఏళ్లుగా చూపించారు. ఇప్పటి లెక్కల ప్రకారం 102 ఏళ్లుండాలి. అంతటి ముసలి కమల్…. షర్టు విప్పి సిక్స్ ప్యాక్ చేయడం, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ప్రదర్శించడం, గాల్లో దూకుతూ ఫీట్లు చేయడం ఇవన్నీ కృత్రిమంగా అనిపించాయి. పైగా ‘భారతీయడు 2’లో సేనాపతి ఇంకా యంగ్ గా కనిపించాడు. ఈ విమర్శలపై దర్శకుడు శంకర్ స్పందించాడు. భారతీయుడు సమయంలో కమల్ వయసు ప్రస్తావించిన సంగతి తనకు గుర్తు లేదని, అందుకే ఆ దిశగా ఆలోచించలేకపోయాయని, ఆ పాత్రకి సూపర్ హీరోలానే చూడాలని, చైనాలో వందేళ్లకు పైబడిన మార్షల్ ఆర్ట్స్ గురువులు ఉన్నారని, వాళ్లు అందరికంటే చలాకీగా ఉంటారని, ఆ స్ఫూర్తితోనే `భారతీయుడు 2` కథ రాసుకొన్నానని వివరణ ఇచ్చారు. ‘భారతీయుడు 2’ తీస్తున్నప్పుడు పార్ట్ 2 ఆలోచన లేదని, ఉండి ఉంటే, సేనాపతి వయసుని ప్రస్తావించేవాడ్ని కాదని శంకర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కథ పార్ట్ 2కే పరిమితం కావడం లేదు. పార్ట్ 3 కూడా వస్తున్న సంగతి తెలిసిందే. సిద్దార్థ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. జులై 12న `భారతీయుడు 2` పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.