దృశ్యం సినిమా.. /అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అయిన కథ. మంచి సినిమాకి కాలం చెల్లిపోలేదని రుజువు చేసిన సినిమా అది. సినిమా అంటే పాటలు, ఫైటింగులు, రొమాన్స్ ఉండక్కర్లేదని మంచి కథ ఉంటే తప్పకుండా చూస్తారని నిరూపించిన సినిమా ఇది. ఈ చిత్రంతో దర్శకురాలిగా తనదైన ముద్ర వేయగలిగింది శ్రీప్రియ. దృశ్యం తరవాత ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే తొందర పడలేదు. ఇప్పుడు ఓ స్క్రిప్టు రెడీ చేసుకొని.. మళ్లీ మెగా ఫోన్ పట్టుకోనుంది. ఈ చిత్రానికి ‘ఘటన’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారట. దృశ్యంలానే ఇది కూడా ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే థ్రిల్లర్ అని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మించే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో హీరో, హీరోయిన్ల పేర్లు బయటకు వస్తాయి. దృశ్యంలానే ఈ ఘనట కూడా మంచి విజయాన్ని సాధించాలని ఆశిద్దాం.