‘రామబాణం’ తరవాత శ్రీవాస్ నుంచి సినిమా రాలేదు. ఇప్పుడు ఆయన మరో కథ రెడీ చేసుకొని, పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవల శ్రీవాస్… రవితేజకు ఓ కథ చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఈ సినిమా మొదలవ్వాలి. అయితే ఇప్పుడు రవితేజ ఈ సినిమా చేయడం లేదని తెలుస్తోంది. ఆ స్థానంలో సందీప్ కిషన్ వచ్చి చేరినట్టు సమాచారం.
ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్స్ తో సాగే కథ ఇదని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తయ్యిందని, సందీప్ కు ఫుల్ నేరేషన్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల `మజాకా`తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. తన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఫ్యామిలీమెన్ 3’లోనూ సందీప్ ఉన్నాడు. ఓ తమిళ సినిమా చేస్తున్నాడు. ఆ తమిళ సినిమాతోనే సమాంతరంగా శ్రీవాస్ సినిమాని మొదలెట్టే ఛాన్స్ వుంది. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.