దర్శకుడు సుకుమార్ అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నార్ట. దాంతో… `పుష్ష` షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సుకుమార్ ముందు నుంచీ… ఇంగ్లీషు మందులు, ఇంజెక్షన్లు, ట్రీట్మెంట్కి దూరం. ఆయన హోమియోపతి వాడుతుంటారు. ఈసారి కూడా హోమియోపతి మందులే వాడుతున్నార్ట. ఆయన ఆరోగ్యం కుదుట పడేంత వరకూ.. `పుష్ష` షూటింగ్ లేనట్టే. ప్రస్తుతం ఆయన ఇంటి పట్టునే విశ్రాంతి తీసుకుంటున్నారు. పుష్ష ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1ని ఈ యేడాదే విడుదల చేస్తారు. పార్ట్ 1కీ పార్ట్ 2కీ కనీసం ఆరు నెలల గ్యాప్ ఉంటుంది. ఈలోగా… బన్నీ కి ఓ సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. కానీ సుకుమార్ మాత్రం.. పుష్ష 2 అయ్యేంత వరకూ బన్నీని వదలకూడదని భావిస్తున్నాడు. కరోనా, లాక్డౌన్ ల వల్ల.. అన్ని సినిమాలతో పాటు పుష్ష షూటింగ్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు సుకుమార్‌కి ఒంట్లో బాగోకపోవడం వల్ల… మళ్లీ ఆగింది.