‘ఆర్య’, ‘జగడం’, ‘ఆర్య2’, ‘100% లవ్’, ‘1 నేన్కొడినే’ వంటి డిఫరెంట్ మూవీస్‌తో డిఫరెంట్ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్. లేటెస్ట్గా ఎన్టీఆర్ కాంబినేషన్లో చేసిన ఫస్ట్ మూవీ ‘నాన్నకు ప్రేమతో’. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్‌తో తెలుగు 360 జరిపిన ఇంటర్వ్యూ.
ఇంతకుముందు వచ్చిన దూకుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, వంటి తండ్రి, కొడుకుల సెంటిమెంట్ సినిమాలకు, ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి వున్న డిఫరెన్స్?
– ఎమోషనల్‌గా వున్నప్పుడు ఒక్కొక్కరి ఎక్స్ప్రెషన్ ఒక్కోలా వుంటుంది. కొంతమంది బాధ కలిగితే ఏడుస్తారు, కొంతమంది కూల్‌గా వుంటారు. అలాంటి కాన్సెప్టే అయినా ఇందులో మరోలా వుంటుంది. పేరెంట్స్‌కి సంబంధించిన ఎమోషన్స్ అనేవి యూనివర్సల్. మా నాన్న తో నాకున్న ప్రేమానురాగాల ఫీలింగ్స్ ని ఎమోషన్ ని మెయిన్ గా తీసుకుని రాసుకున్న కథ ఇది.
ఈ సినిమా కథ విషయంలో మీరు, ఎన్టీఆర్, ఇంకా యూనిట్ మెంబర్స్ చాలా మంది కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. ఇలాంటి కథను చెయ్యాలని ఫీల్ అవ్వడం వెనుక రీజన్?
– ఏదైనా మన వరకు వస్తేగానీ ఎమోషన్ అనేది అర్థం కాదు. ఎవరి పేరెంట్స్ అయినా చనిపోతే వెళ్ళి పలకరించేవాళ్ళం కానీ దాని ఎమోషన్ అర్థమయ్యేది కాదు. మా నాన్నగారు చనిపోయినపుడు ఆ ఎమోషన్ ఏమిటనేది తెలిసింది. ఇక ఎప్పుడూ నాన్న మాట్లాడడు, మనం టచ్ చేయలేం, మన మధ్య వుండడు అనే విషయం గుర్తొస్తేనే తట్టుకోలేం. అలాంటి సిట్యుయేషన్లోనే ఈ కథ రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే అప్పటి మానసిక స్థితిని ఈ కథకు ఉపయోగించుకున్నాను.
ఫీల్ గుడ్ మూవీ అంటున్నారు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవా ?
– నా వరకు ఆనందించడానికి మిమ్మలిని పెన్ను పేపర్ ఫ్రీ గా అడిగి నాకు ఇష్టమైన కవితలు రాసుకుని ఎంజాయ్ చేస్తాను. సినిమా కథ అనేది టోటల్ యూనిట్ కి సంబంధించినది ముఖ్యంగా డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ కు నష్టం రాకూడదు. అదే విదంగా ప్రేక్షకులు ఆదరించాలి వాళ్ళను నవ్వించాలి. ఎడిపించాలి సినిమా చూస్తున్నంత సేపు తనుకు తాను ఓన్ చేసుకోవాలి. అక్కడి పాత్రలు తనవే అని గుర్తుకు తెచ్చుకుని ఎమోషన్ కు గురి కావాలి. ఆ ఫీలింగ్ ఈ సినిమా లో వుంటుంది.
మీ నాన్నగారి పేరు?
– తిరుపతి రావు.
మీ నాన్నగారి గురించే చెపుతున్నారు అమ్మ గారి గురించి చెప్పలేదు?
– ఇక్కడ నాన్నకు ప్రేమతో..సినిమా గురించి మాట్లాడు తున్నాం కదా. అయిన మా అమ్మ గురించి చెప్పాలంటే ఆమె తెలివి గల అమాయకురాలు మా నాన్న మేము ఆమె లోకం అంతే.
మీ సినిమాల్లో హీరోలు అసెంట్రిక్గా, పెక్యులర్‌గా వుంటారు. ఎందుకని?
– నిజంగా మనుషుల్ని ప్రేమిస్తే వారిలోని లోపాల్ని కూడా ప్రేమించాలి. చిన్న పిల్లలు బొమ్మల విషయంలోగానీ, తన చెల్లినో, తమ్ముడినో ఎక్కువగా ప్రేమగా చూడడం గానీ వాడికి అసూయ కలిగిస్తుంది. అవి కూడా మనకి ముద్దుగా అనిపిస్తాయి. వాటి గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. అవన్నీ మన నుంచే వచ్చాయి కాబట్టి చాలా అందంగా కనిపిస్తాయి. ఒక మనిషిని నిజంగా ప్రేమించేవాడు అతనిలోని స్వార్థాన్ని, అసూయని కూడా సహృదయంతో అర్థం చేసుకుంటాడు. అందుకే నా సినిమాల్లోని క్యారెక్టర్స్ అలా అనిపిస్తాయి.
అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం?
– తారక్ ఫేస్‌లో ఎప్పుడూ ఒక ఎమోషన్ కనిపిస్తుంది. నవ్వుతున్నా ఒక ఎమోషన్ కనిపిస్తుంది. అతనితో ముందు ప్రేమ కథ అనుకున్నాం. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అనుకున్న కథని ఎన్టీఆర్‌తో అయితే బాగుంటుందనిపించింది. ఎన్టీఆర్‌కి మొదట చెప్పిన కథ నచ్చింది, ఈ కథ కూడా బాగా నచ్చింది. వెంటనే చేసేద్దాం అన్నాడు.
ఎన్టీఆర్‌తో ఫస్ట్‌టైమ్ వర్క్ చేయం ఎలా అనిపించింది?
– మొదటిసారి ఎవరితోనైనా కొత్తగా లవ్‌లో పడితే ఎలా వుంటుందో కొత్త కాంబినేషన్లో సినిమా చెయ్యడం కూడా అలాగే వుంటుంది. తారక్ చాలా డిఫరెంట్, చాలా ఎమోషనల్. ప్రేమ వుంటే మామూలుగా వుండదు తుఫాన్‌లా వుంటుంది. తారక్ వున్నంత సేపు అందులో మునుగుతూనే వుంటాం. అతను ఒక డ్రగ్ లాంటి వాడు అలవాటు పడితే అంతే వదలడు. మా ఇద్దరి మధ్య అంత బాండ్ ఫామ్ అయింది. నెక్స్ట్ సినిమా అతనితో చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ, అతనితో వున్న బాండ్ మాత్రం అలా సాగుతూనే వుంటుంది.
మహేష్ తో సినిమా ఎప్పుడు ?
– నెక్స్ట్ అంటే నాకు ఒక రివెంజ్ వుంది, ఒక గోల్ వుంది. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ డైరెక్టర్ని ఆ సినిమా హీరోగానీ, నిర్మాతలుగానీ ఎలా చూస్తారో నాకు తెలీదు గానీ, మహేష్ నన్ను ఎంత అభిమానిస్తాడో మాటల్లో చెప్పలేను. అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలకు కూడా నేనంటే ఎంతో అభిమానం. నేను ఆ సినిమాకి రివెంజ్ తీర్చుకోవాలని వుంది. మహేష్‌తో ఒక మంచి సూపర్‌హిట్ మూవీ తియ్యాలన్నది నా గోల్. నా నెక్స్ట్ మూవీ అదే అని నేను చెప్పడం లేదు. మహేష్ నన్ను పూర్తిగా నమ్మాడు. 1 సినిమా కు నేను అతన్ని మోసం చేశాను అనుకుంటున్నాను. అందుకే అతనికి ఒక హిట్ సినిమా చేస్తాను.
నెక్స్ట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు?
– అలా ఏం అనుకోలేదు. మరో మూడు నెలల వరకు ఏ సినిమా స్టార్ట్ చెయ్యాలనుకోవడం లేదు. అయితే దేవిశ్రీప్రసాద్‌తో సినిమా అనుకున్నాం. అది జరుగుతుంది. అది ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు డైరెక్టర్ సుకుమార్.