దర్శకుడు తేజ ఇంతవరకు ఎప్పుడు కొత్తవారితోనే సినిమాలు తీస్తూ వచ్చేడు. కానీ ఏనాడూ పెద్ద హీరోలతో సినిమాలు చేయలేదు. కారణం తనకి వారిని హ్యాండిల్ చేసేంత శక్తి (కెపాసిటీ) లేదని చెపుతుండేవాడు. ఆయన తన మనసులో మాటని బయటపెట్టకపోయినా, చిన్న హీరోలు, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన వారితో అయితేనే తనకు నచ్చినట్లు చెప్పి నటింపజేసుకొనే అవకాశం ఉందని, వారయితేనే తను చెప్పిన మాట సరిగ్గా వింటారని ఆయన అభిప్రాయం కావచ్చును. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో అందరి కంటే సీనియర్ హీరో అయిన వెంకటేష్ తో లేదా పెద్ద నటుడుగా పేరున్న నాగ చైతన్య ఇద్దరిలో ఎవరో ఒకరితో తన తరువాత సినిమాను తీయబోతున్నట్లు తాజా సమాచారం. ఇద్దరికీ తను వ్రాసుకొన్న కధని చెప్పగా ఇద్దరూ కూడా అతని దర్శకత్వంలో నటించేందుకు సుముఖంగా ఉన్నట్లు టాక్. బహుశః నేడో రేపో, ఈ సినిమా గురించి తేజ స్వయంగా ఒక ప్రకటన చేయవచ్చునని సమాచారం. ఇంతవరకు సీనియర్లతో సినిమా చేయడానికి జంకిన దర్శకుడు తేజ ఇప్పుడు వారితోనే సినిమా తీయడానికి సిద్దపడుతున్నారంటే వారంటే భయం పోయిందనుకోవాలా…లేక తన కధ మీద నమ్మకమనుకోవాలా?