వంశీ కెరీర్ని మలుపు తిప్పిన చిత్రాల్లో ‘అన్వేషణ’ ఒకటి. థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ చిత్రం.. అప్పట్లో సంచలనం సృష్టించింది. రఘు కెమెరా పనితనం, ఇళయరాజా సంగీతం, భానుప్రియ అందాలు ఈ చిత్రానికి సరికొత్త వన్నె తీసుకొచ్చాయి. ఆ తరవాత ‘అనుమానస్పదం’ అనే మరో థ్రిల్లర్ తీశాడు వంశీ. అదీ ఓకే అనిపించుకొంది. అందులోని పాటలన్నీ హిట్టే. ఇప్పుడు వంశీ మరో థ్రిల్లర్ కథతో మ్యాజిక్ చేయబోతున్నాడని టాక్. వంశీ నుంచి ‘లేడీస్ టైలర్ సన్నాఫ్ ఫ్యాషన్ డిజైనర్’ సినిమా వస్తోంది. దాని తరవాత.. థ్రిల్లర్ని తెరకెక్కిస్తార్ట. ఇప్పటికే కథ సిద్దంగా ఉందని, ప్రస్తుతానికి నటీనటుల ఎంపిక జరుగుతోందని సమాచారం.
ఈ కథ కూడా… గోదారి అందాల నడుమే తెరకెక్కించాలని వంశీ ఫిక్సయ్యాడట. అన్నట్టు ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఫ్యాషన్ డిజైనర్కీ తనే సంగీత దర్శకుడు. అందులోని పాటలు ఓకే అనిపించుకొన్నాయి. తన కెరీర్లో తొలిసారి వంశీ సినిమాకి పనిచేశాడు మణిశర్మ. ఆ వెంటనే వంశీతో మరో ఛాన్స్ వచ్చేసింది. వంశీ అంతే.. ఒకర్ని పట్టుకొన్నాడంటే అంత తేలిగ్గా వదలడు. చూద్దాం ఈ సినిమా అన్వేషణ అవుతుందో, లేదంటే… అనుమానాస్పందం లా మారుతుందో..?