కుర్ర‌ ద‌ర్శ‌కుల‌కు ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు

ఈమ‌ధ్య బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాస్త మెరిసిన సినిమాల్లో ‘ఆయ్‌’, ‘క‌మిటీ కుర్రాళ్లు’ ఉన్నాయి. వ‌రుస ఫ్లాపుల‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన సినిమాలు ఇవి. ఈ రెండు చిత్రాల్నీ కొత్త ద‌ర్శ‌కులే తెర‌కెక్కించ‌డం విశేషం. ఆయ్ సినిమాతో అంజి దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. క‌మిటీ కుర్రాళ్లు’ చిత్రంతో వంశీ మెగాఫోన్ ప‌ట్టాడు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌కు చేతి నిండా ఆఫ‌ర్లే ఆఫ‌ర్లు.

‘ఆయ్‌’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ‘ఆయ్‌’ షూటింగ్ స‌మ‌యంలోనే అంజితో మ‌రో సినిమాకు అగ్రిమెంట్ జ‌రిగిపోయింది. ‘ఆయ్‌’ హిట్ట‌యినా, ఫ్లాప్ అయినా, గీతా 2లోనే ఓ సినిమా చేయాల‌న్న‌ది ఒప్పందం. సో.. అంజి త‌దుప‌రి సినిమా గీతా ఆర్ట్స్ లోనే. ‘క‌మిటీ కుర్రాళ్లు’ దర్శ‌కుడు వంశీ కూడా నిర్మాత‌ల క‌ళ్ల‌ల్లో ప‌డ్డాడు. ఇద్ద‌రు నిర్మాత ద‌గ్గ‌ర వంశీ అడ్వాన్సు తీసుకొన్నాడ‌ని తెలుస్తోంది. అయితే హీరో దొర‌కాలి. ‘మారుతి నగ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం’ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య కూడా ఓకే అనిపించుకొన్నాడు. అంత‌కు ముందు ‘హ్యాపీ వెడ్డింగ్‌’ అనే సినిమా తీశాడు ల‌క్ష్మ‌ణ్‌. ఆ సినిమా కంటే ‘మారుతి న‌గ‌ర్‌’లో బెట‌ర్ అవుట్ పుట్ ఇచ్చాడు. ఈటీవీ విన్‌లో వ‌చ్చిన ‘వీరాంజ‌నేయులు విహార యాత్ర‌’కూ మంచి అప్లాజ్ వ‌చ్చింది. ఈ సినిమాతో అనురాగ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. ఓటీటీ సినిమానే అయినా, అనురాగ్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. ఓ చిన్న పాయింట్ ని చాలా డీసెంట్ గా, కామెడీ ట‌చ్‌తో డీల్ చేసిన విధానం అంద‌రికీ న‌చ్చింది. ఈటీవీ విన్‌లోనే అనురాగ్ మ‌రో సినిమా చేస్తాడ‌ని టాక్‌. ఇలోగా మ‌రో ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌లు అనురాగ్ తో సంప్ర‌దింపులు మొద‌లెట్టారు. హీరోలు, మీడియం రేంజు నిర్మాత‌లూ ఈ ద‌ర్శ‌కుల‌పై కాస్త దృష్టి పెట్టే అవ‌కాశం ఉంది. అదృష్టం బాగుండి కాస్త పేరున్న హీరో దొరికితే వీళ్ల ప్ర‌యాణం మ‌రింత మెరుగ్గా ఉంటుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు...

సత్య.. ది వన్ అండ్ ఓన్లీ…

సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా...
video

దేవర ముందర బావ బావమరిది

https://www.youtube.com/watch?v=7QCGkkKiJOE 96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా...

వేణుస్వామిపై కేసు – మూర్తి సక్సెస్

జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close