ఉప్పూ-నిప్పులా ఉండే నేతలు ఒకే వేదికపై కనిపిస్తే…? అది కూడా రాజకీయంగా తీవ్ర వైరుధ్యమున్న సీఎం రేవంత్ రెడ్డి- కేటీఆర్ లు కలిసే…? అందరూ ఇదే ఆసక్తిగా ఎదురుచూశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి సంతాప సభలో ఇరువురి హజరవుతున్నందున కలుస్తారా? కలిస్తే మాట్లాడుకుంటారా? అని రాజకీయవర్గాలు ఎదురుచూశాయి.
అయితే, సభకు ఇద్దరు నేతలు హజరయ్యారు. కానీ వేర్వేరు సమయాల్లో రావటంతో కలవలేదు. ముందుగా అనుకున్న సమయానికి మాజీ మంత్రి కేటీఆర్ మీటింగ్ వచ్చారు. అప్పటికి సీఎం రాలేదు. కానీ, కేటీఆర్ పక్కనే ఎమ్మెల్సీ కోదండరాం కూర్చున్నారు. ఉద్యమ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం ఉన్నా, ఆ తర్వాత రాజకీయంగా దారులు వేరయ్యాక కలవలేదు. కానీ ఈరోజు మాత్రం మాట్లాడుకుంటూ కనిపించారు. ఇక కేటీఆర్ తన స్పీచ్ అయ్యాక ఎక్కువ సేపు వెయిట్ చేయలేదు.
కేటీఆర్ వెళ్లిపోయాక కాసేపటికి సీఎం రేవంత్ రెడ్డి సభకు హజరయ్యారు. దీంతో అందరూ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి-కేటీఆర్ కలయిక జరగలేదు.