హీరోగా తన ఇన్నింగ్స్‌ని దాదాపుగా పుల్ స్టాప్ పెట్టేసిన సునీల్, కమెడియన్ పాత్రలవైపు దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. `అరవింద సమేత వీర రాఘవ`తో కాస్త బ్రేక్ వచ్చినట్టైంది. క్రమంగా తనకు అవకాశాలూ పెరుగుతున్నాయి. రవితేజ మూడు పాత్రల్లో కనిపించే `అమర్ అక్బర్ ఆంటోనీ` సినిమాలో హాస్య నటుడిగా కనిపించబోతున్నాడు సునీల్. ఇప్పుడు మరోసారి రవితేజ సినిమాలోనే ఛాన్స్ దక్కించుకున్నాడు. రవితేజ కథానాయకుడిగా `డిస్కోరాజా` అనే సినిమా తెరకెక్కనుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సునీల్‌కి ఓ కీలకమైన పాత్ర దక్కింది. రవితేజ రికమెండేషన్‌తోనే సునీల్‌కి ఈ ఛాన్స్ వచ్చిందని ఇండ్రస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అమర్ అక్బర్ ఆంటోనీలో సునీల్ పాత్ర బాగా పండిందట. అది దృష్టిలో ఉంచుకునే… ఈ సినిమాలో ఛాన్స్ ఇప్పించాడని తెలుస్తోంది. ఈ దీపావళికి మోషన్ పోస్టర్ని విడుదల చేస్తారు. టైటిల్ ని కూడా అప్పుడే ప్రకటిస్తారు.