విశాఖలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని.. ఒక్కో కుటుంబానికి యాభై వేల సాయం చేస్తామని పవన్ ప్రకటించారు. తానే స్వయంగా వస్తానని పవన్ ప్రకటన చేశారు. అంతే ప్రభుత్వ నవనాడులు కదిలిపోయాయి. వెంటనే.. మత్స్యకారులకు సీఎం జగన్ ప్రకటించిన ఎనభై శాతం సాయాన్ని విడుదలచేసినట్లుగా.. దాన్ని బాధితులకు పంపిణీ చేసినట్లుగా కార్యక్రమం నిర్వహించేశారు. నిజంగా ఇచ్చారా అంటే లేదు. అది కలెక్టర్ ఖాతాలో ఉన్నాయట. నష్టాన్ని అంచనా వేసి అందులో ఎనభై శాతం ఇస్తారట. మరి ఇవ్వకుండానే ఎందుకు కార్యక్రమం నిర్వహించినట్లు అంటే.. పవన్ వస్తున్నారు మరి.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాదంలో నష్టపోయిన వారిని పరామర్శించేందుకు శుక్రవారం పవన్ కల్యాణ్ వెళ్తున్నారు. వారికి సాయం చేస్తారు. మత్స్యకారులు ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న స్పాన్సర్డ్ టెర్రరిజంగా వారు భావిస్తున్నారు. అందుకే సీఎం జగన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. వారి ఆగ్రహం గుర్తించి నష్టపరిహారం ప్రకటన చేయలేదు. కానీ తప్పు ఎవరిది ఎందుకు నిప్పు పెట్టారో మాత్రం దర్యాప్తు చేయలేదు.
పవన్ సాయం కోసం శుక్రవారం వస్తున్నారని తెలియగానే గురువారమే జగన్ రెడ్డి డబ్బులు కలెక్టర్ ఖాతాలో వేశారని.. మీకు పంపిణీ చేయడమే మిగిలిందని చెప్పి… పిలిచి.. హడావుడి చేశారు. ఓ పెద్ద చెక్కు బొమ్మతో ఫోటోలు దిగారు. కానీ అవి వారి ఖాతాల్లో పడలేదు. ఇప్పుడు పవన్ వస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చే యాభైవేలు తీసుకోవద్దని బెదిరిస్తున్నారు. అలా తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చే సాయం ఆగిపోవచ్చని వాలంటీర్లను పంపి బెదిరిస్తున్నారు. ఈ తీరు చూసి మత్స్యకారులు మరింత రగలిపోతున్నారు.