టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ తన మార్కెట్ స్టామినాను భారీగా పెంచేసుకున్నాడు. మరీ ముఖ్యంగా తను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ఓవర్సీస్ కలెక్షన్స్ విషయంలో కూడా ఇఫ్పుడు ఎన్టీఆర్ టాప్ రేంజ్ స్టార్స్‌తో సమానంగానే ఉన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ మాత్రం అటు హీరోగా, ఇటు నిర్మాతగా వరుస డిజాస్టర్స్‌తో ఉన్నాడు. కిక్-2 సినిమాతో భారీగా నష్టపోయిన కళ్యాణ్ రామ్‌ని రీసెంట్గా వచ్చిన ఇజం సినిమా మరికాస్త దెబ్బకొట్టింది. మరి అలాంటి కళ్యాణ్ రామ్ నిర్మాత అంటే ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ ఎంత ఉండబోతోంది? సర్దార్ సినిమాతో దెబ్బతిన్న బాబీకి గట్టిగా యాభై లక్షల రెమ్యూనరేషన్ కూడా ఇచ్చే అవకాశం లేదు. అట్టే మాట్లాడితే అవకాశం ఇవ్వడమే ఎక్కువ అన్న పరిస్థితి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించి కళ్యాణ్ రామ్‌ని గట్టున పడెయ్యడానికే ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నాడా? అన్న ఊహాగానాలు చాలానే వినిపించాయి. అయితే అవన్నీ ఊహాగానాలేనన్న లేటెస్ట్ సమాచారం బయటకు వచ్చింది. నిజానికి కళ్యాణ్ రామ్‌కి తోడుగా పెట్టుబడి పెట్టే వేరేవాళ్ళను ఈ సినిమాకు యాడ్ చేయాలని ఎన్టీఆర్ ట్రై చేశాడు. అయితే ఎన్టీఆర్ ప్రయత్నాలు తెలుసుకున్న డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ మేం పెట్టుబడి పెడతాం అని ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాలనే నమ్ముకుని ఉన్న బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. రీసెంట్గా కళ్యాణ్ రామ్ ఇజం సినిమాను కూడా వాళ్ళే రిలీజ్ చేశారు.
ఇప్పుడు ఎన్టీఆర్-బాబీ సినిమాకు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్‌ని వాళ్ళే ఇస్తున్నారట. తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలన్న ఐడియా ఎన్టీఆర్‌కి అస్సలు లేదని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా అలాంటి ప్రపోజల్‌కి ఒప్పుకునే అవకాశం లేదు. రవితేజ హీరోగా నటించిన కిక్-2తో సహా తను హీరోగా నటించిన సినిమాల విషయంలో కూడా బడ్జెట్ దగ్గర లిమిట్స్ పెట్టుకోవడం కళ్యాణ్ రామ్‌కి అస్సలు ఇష్టం ఉండదు. కథకు తగ్గట్టుగా భారీగానే పెట్టుబడి పెట్టడం కళ్యాణ్ రామ్ అలవాటు. ఇక తమ్ముడు హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ సినిమా విషయంలో తగ్గుతాడా? అదే జరుగుతోంది. బయ్యర్స్ దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకుని ఈ సినిమాను భారీగా తెరకెక్కించే ప్రయత్నాల్లోనే ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ ప్రసాద్‌ని కన్ఫాం చేశారని తెలుస్తోంది. అలాగే శృతీ హాసన్‌ని కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కోసం తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలన్నీ కూడా కొంచెం క్లాస్ టచ్‌తో ఉన్నవే. అందుకే బాబీ తెచ్చిన మాస్ ఎంటర్టైనర్ కథ అయితే ఇప్పుడు వెరైటీగా ఉంటుందన్న ఉద్ధేశ్యంతోనే ఎన్టీఆర్ బాబీకి ఒకె చెప్పాడట. తన మాస్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేశాడని, ఈ సినిమా కూడా ఎన్టీఆర్ స్థాయిలోనే భారీగానే తెరకెక్కుతుందని, ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు. మరి బాబీ చూపించబోయే మాస్ ఎన్టీఆర్…సారీ..ఎన్టీఆర్‌లు ఎలా ఉండబోతున్నారో చూడాలి.