ఆయన హీరో. ఓ రకంగా వెటరన్ హీరో. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లకు పోటీగా సినిమాలు చేశారు. స్టార్ డమ్ అనుభవించాల్సిన హీరోనే. కానీ తన ప్రవర్తన వల్ల, టైమ్ సెన్స్ లేకపోవడం వల్ల – ఆ హోదాని తనే తన్నేసుకున్నాడు. కొన్నేళ్లుగా హిట్లు లేవు. ఈమధ్యే ఓసినిమా హిట్టయ్యింది. ఆ తరవాత సినిమా మళ్లీ ఫ్లాప్. చేతిలో ఉన్న సినిమాల ఒకటి జారిపోయింది. దాంతో… హీరోగారి మైండ్ కాస్త డిస్ట్రబ్ అయ్యిందని తెలుస్తోంది. అప్పుడప్పుడూ హీరోగారు వింతగా ప్రవర్తిస్తున్నారని, ఆయన చేష్టల వల్ల చుట్టు పక్కల వాళ్లు ఇబ్బంది పడుతున్నారని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమా వేడుకల్లో, సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలకమైన మీటింగుల్లోనూ ఈయన గారి ప్రవర్తన వింతగా అనిపిస్తోందట. ఎవరైనా మాట్లాడుతుంటే, మైకులు లాగేసుకోవడం, వెనుక నుంచి వెళ్లి హత్తుకోవడం చేస్తుండడంతో.. ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికీ అర్థం కావడం లేదట. తనకు చిర్రెత్తుకొచ్చినప్పుడు కారేసుకుని ఒక్కడే ఎటో వెళ్లిపోతున్నాడట. అతన్ని వెదికి పట్టుకురావడానికి నానా తంటాలూ పడాల్సివస్తోందట.
అన్నట్టు… ఈయనకు హోమియోపతిలో కాస్త పట్టుంది. పరిశ్రమలో ఎవరికి బాగోలేకపోయినా, వాళ్లింటికెళ్లి హోమియోపతి మందులు ఇస్తున్నాడట. ఇది మంచి అలవాటే. కానీ. హోమియో వాడాల్సిందే అని పట్టుపట్టడం, బలవంతంగా ఇంగ్లీషు మందులు మాన్పించడం చేస్తున్నాడట. దాంతో… రోగం వచ్చినది ఓ బాధైతే, ఈ డాక్టరు కాని డాక్టరు ఇస్తున్న వైద్యంతో మరో బాధ అనుభవించాల్సివస్తోందట. అన్నింటికంటే ముఖ్యంగా ఈ హీరోకి చాలా అప్పులుఉన్నాయట. అప్పులు తీర్చమని ఒత్తిడి ఎక్కువవ్వడంతో – మానసికంగా ఎఫెక్ట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.