భారతదేశ చిత్రపటంలో.. కశ్మీర్… భరతమాత శిరస్సులా ఉంటుంది. ఆ శిరస్సు లేని దేశాన్ని ఎవరూ ఊహించలేరు. నిన్నటిదాకా.. ఆ మొత్తం భాగాన్ని జమ్మూ – కశ్మీర్ గా మాత్రమే పిలిచేవారు. కానీ.. ఇప్పుడు అది రెండు రాష్ట్రాలయింది. కశ్మీర్ సమస్యను.. అత్యంత చాకచక్యంగా పరిష్కరించే క్రమంలో మోడీ, షా ఆర్టికల్ 370 రద్దు మాత్రమే కాదు.. జమ్మూకశ్మీర్‌ను విడగొట్టి సంచలనం సృష్టించారు. ఓ భాగం.. జమ్మూకశ్మీర్‌గా ఉండగా.. మరో భాగంగా.. లద్దాఖ్ గా ఉండబోతోంది.
కశ్మీర్‌ను విడగొట్టినా తగ్గిన రాష్ట్రాల సంఖ్య..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి.. తెలంగాణను ఏర్పాటు చేసిన తర్వాత.. భారత దేశంలోని రాష్ట్రాల సంఖ్య 29కి చేరింది. ఇప్పుడు.. జమ్మూకశ్మీర్‌ను రెండుగా విడదీసినందున.. రాష్ట్రాల సంఖ్య 30కి చేరాలి. కానీ.. 28కి తగ్గింది. ఎందుకంటే.. విడగొట్టిన రెండు రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగానే కేంద్రం ప్రకటించింది. ఈ కారణంగా రాష్ట్రాల సంఖ్య తగ్గి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య పెరిగింది. జమ్ము-కశ్మీర్ చట్టసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉండనుంది. ప్రస్తుతం రాష్ట్రాల సంఖ్య 28, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య తొమ్మిదిగా మారింది.
విభజనతో వచ్చే లాభం ఏమిటి..?
జమ్మూకశ్మీర్ యంత్రాగాన్ని… భౌగోళిక స్వరూపాన్ని మార్చివేయడంతో.. పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు… పాకిస్తాన్ సరిహద్దుతో ఉన్న ప్రాంతం… ఇతర దేశాల సరిహద్దుతో ఉన్న ప్రాంతాలు వేర్వేరుగా ఏర్పడ్డాయి. పాకిస్తాన్ సరిహద్దుతో ఉన్న ప్రాంతానికి చట్ట సభ ఉండే ఏర్పాటు చేసినా… అది ఢిల్లీ ప్రభుత్వంలాగే ఉంటుంది. ఓ రకంగా కేంద్రమే అక్కడ పరిపాలన చేస్తుంది. కాశ్మీర్లో పార్లమెంట్ ఎన్నికలు పెట్టగలిగినప్పుడు.. అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోయారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. పార్లమెంట్‌కు ఓటేసిన వాళ్లు… అదే బ్యాలెట్ యూనిట్‌పై అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఓటేసేవాళ్లు .. కానీ పకడ్బందీ వ్యూహంతోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిచలేదు. ఇప్పుడు విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌లో హిందూ సీఎం ఎన్నిక కావడానికి అవకాశం ఉంది. జమ్మూ ప్రాంతంలో హిందువులు మెజార్టీగా ఉన్నారు. ముస్లింలు మెజార్టీగా లద్దాఖ్‌లో.. అసలు చట్టసభ లేదు కాబట్టి సమస్య లేదు.
కాగల కార్యం ఇమ్రానే తీర్చారు..!
కశ్మీర్ అంశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకునేలా చేసేందుకు ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ సైనిక దళాల ప్రధానాధికారి, ఐఎస్ఐ చీఫ్‌లతో కలిసి వాషింగ్టన్లో చేసిన ప్రయత్నాలు చేశారు. ఇది తెలిసిన తర్వాతే మోడీ.. దూకుడు పెంచారు. ట్రంప్‌కి కానీ.. పాకిస్థాన్ కు కానీ ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. ట్రంప్ వ్యవహారశైలి తెలుసు కాబట్టి.. నేరుగా మోడీ కార్యచరణలోకి దిగారు., అనుకున్నది సాధించారు.