మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవి ప్రకాష్ కుమార్ భార్య సైంధవితో విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు సోలోగానే ఉంటున్నాడు. అయితే ఈ విడాకులు వ్యవహారంలో హీరోయిన్ దివ్యభారతిని సోషల్ మీడియాలో కొందరు కార్నర్ చేస్తున్నారు. అసలు జీవి ప్రకాష్ కాపురంలో చిచ్చు పెట్టింది దివ్యభారతేనని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దివ్యభారతి కారణంగానే జీవి భార్యతో విడిపోయాడని, జీవి, దివ్యభారతి ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని చాలా రూమర్స్ వస్తున్నాయి.
అయితే రూమర్స్ అన్నిటిపై తాజాగా దివ్యభారతి చాలా ఘాటుగా స్పందించింది. ”నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను. ముఖ్యంగా పెళ్లి అయిన వ్యక్తితో డేటింగ్ చేయను. ఇది కంప్లీట్ గా నాన్సెన్స్. ఆధారాలు లేకుండా ఇలాంటి పనికిమాలిన వార్తలు సృష్టించకండి. ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. కానీ నా మౌనాన్ని చేతకానితనంగా తీసుకుని హద్దులు మీరి మాట్లాడుతున్నారు. ఇలాంటివి మానేయండి. ఈ విషయంలో ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్’ అంటూ చాలా స్ట్రాంగ్ గా సమాధానం ఇచ్చింది దివ్యభారతి.
జీవి, దివ్యభారతి బ్యాచిలర్ సినిమా కోసం కలిసిపని చేశారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం వుంది. ఇటివలే కింగ్ స్టన్ సినిమాలోనూ కలిసి నటించారు. తమది స్నేహమే కాని మరొకటి కాదని గతంలో జీవి కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈసారి దివ్య క్లారిటీతోనైనా ఈ వార్తలకు పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.