గద్వాల నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణను విజేతగా నిర్ణయిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే అప్పట్లో ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవుతారు. కానీ ట్విస్ట్ ఏమింటటే ఇప్పుడు బీజేపీలో ఉన్నాయి. కీలక పదవిలో ఉన్నారు. అయితే ఎమ్మెల్యే అవడానికి ఇలాంటి నైతిక పరమైన విషయాలు అడ్డంకి కావని ఆమెకు తెలుసు కాబట్టి రంగంలోకి దిగిపోయారు.
ఎమ్మెల్యేగా గుర్తిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. హైకోర్టు తీర్పు కాపీని శాసనసభ కార్యదర్శికి ిచ్చి తనను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసి.. ప్రమాణస్వీకారం చేయించాలని కోరాలని నిర్ణయంచుకున్నారు. డీకే అరుణ వస్తున్నారని రాలేదో.. లేకపోతే మరో కారణమో కానీ.. ఆఫీసులో శాసనసభా కార్యదర్శి లేరు. స్పీకర్ సిబ్బంది స్పందించలేదు. దీంతో హైకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. తీర్పు వచ్చి వారంరోజులు అయినా కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు.
గతంలో ఇలాగే కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కూడా హైకోర్టు అనర్హతా వేటు వేస్తే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినా… డీకే్ అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే.. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఎవరిక పదవి అనుభవించేది ఏమీ ఉండదు. కానీ సాంకేతికకంగా అనేక సమస్యలు మాత్రం వస్తాయి