అడివి శేష్‌కి పెళ్లి అయిందా? కాలేదా?…త్వరలో పెళ్లి చేసుకోనున్నారా? ఈ నెలాఖరున ఆయన చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదేనా.. ట్విట్టర్లో ఈ విషయం మీద కాసేపు సరదా మాటలు నడిచాయి. ఇంతకీ ఉన్నట్టుండి అడివి శేష్ పెళ్లి ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు?… ఎందుకంటే ఆయన ట్వీట్ చేశాడు కనుక. ఏమని… “ఈ నెలాఖరున ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. ప్రస్తుతానికి సస్పెన్స్` అని. మరి దానికీ, పెళ్లికీ లింక్ ఎక్కడ పడింది..? ఈషా రెబ్బా రూపంలో పడింది. `ఏంటి శేష్.. పెళ్లి కబురు చెప్పబోతున్నావా` అని అడివి శేష్‌ని ఉద్దేశించి ట్వీట్ చేసింది కాబట్టి. అంత వరకు అంతా బానే ఉంది. మరి.. అతనికి ఆల్రెడీ పెళ్లిందని అన్నదెవరు? ఇంకెవరు.. బ్రహ్మాజీ. `ఇంకా పెళ్లి కాలేదా` అని బ్రహ్మాజీ చమత్కరించారు. కానీ ఈషారెబ్బా ట్వీట్‌కు మాత్రం అడివి శేష్ కోపంగా ఉన్న ఎమోజీని పోస్ట్ చేశారు. అంటే విషయం పెళ్లికి సంబంధించి మాత్రం కాదు. ఏదో సినిమాకు సంబంధించిందే. అయితే ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్ అన్నమాట.