తొలి సినిమా ఆర్యతోనే దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు సుకుమార్. ఆ సినిమాతోనే బన్నీ కూడా యూత్‌తో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ సినిమా నుంచి సుక్కు – బన్నీల మధ్య స్నేహం మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆర్య 2 డిజాస్టర్ అయ్యింది. అయినా.. ఆ స్నేహం చెడిపోలేదు. అల్లు అర్జున్ కోసం సుక్కు ఓ షార్ట్ ఫిల్మ్ కూడా చేసిచ్చాడు. ఇప్పుడు వీరి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోందని సమాచారం. రంగస్థలం తరవాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఆ అవకాశం బన్నీకే ఎక్కువ ఉందని తెలుస్తోంది.
‘నా పేరు సూర్య’ తరవాత అల్లు అర్జున్ కూడా ఖాళీనే. తన తదుపరి సినిమాల గురించి బన్నీ ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడు. సుక్కుతో ఓ సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నాడని టాక్. అయితే అది ‘రంగస్థలం’ రిజల్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ‘రంగస్థలం’ హిట్టయితే… అప్పుడు సుకుమార్‌పై కర్చీఫ్ వేయడానికి బన్నీ ప్లాన్స్ వేసుకుంటున్నాడట. ఇద్దరి మధ్యా మంచి రాపో ఉంది. కాబట్టి బన్నీ అడిగితే సుక్కు కాదనడు. సో… బన్నీ తదుపరి సినిమా ఏంటో తెలియాలంటే.. ఈనెల 30 వరకూ ఆగాల్సిందే.