పిల్ల జమిందార్‌తో ఓ హిట్టు కొట్టాడు అశోక్. ఆ తరవాత వచ్చిన సుకుమారుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరో అవకాశం అందుకోవడానికి చాలా కాలం పట్టింది. మధ్యలో వెంకటేష్‌తో ఓ సినిమా అనుకున్నారు. కానీ అది వర్కవుట్ కాలేదు. 2012 నుంచి ‘భాగమతి’ కథ పట్టుకుని అనుష్క చుట్టూ తిరుగుతున్నాడు. ఎట్టకేలకు ఆ సినిమా పూర్తయి.. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘భాగమతి’పై మంచి అంచనాలే ఉన్నప్పటికీ అశోక్ క్యాలిబర్పై ఎవ్వరికీ నమ్మకాల్లేవు. ఈ సినిమాని తను ఎలా తీశాడో అనే సందేహాలు నెలకొంటున్నాయి. కాకపోతే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ఈ సినిమా కోసం అశోక్‌ని డైరెక్షన్ చేయనివ్వలేదట. అంతా కో డైరెక్టర్లు, సహాయకులు చూసుకున్నార్ట. కెమెరామెన్ మది ఈ చిత్రానికి దర్శకుడిగానూ వ్యవహరించాడని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌కి అశోక్ చెప్పిన కథ బాగా నచ్చిందని, కథ మాత్రమే ఇవ్వమని అడిగినా.. అశోక్ ఒప్పుకోలేదని.. అందుకే దర్శకుడిగా అశో్క్కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి… యూవీ క్రియేషన్స్ అతన్ని డమ్మీ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘భాగమతి’ హిట్టయితే సరే.. లేదంటే… ఆ ప్రభావం అశోక్‌పై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.