రుద్రమదేవికి మరోసారి అన్యాయం జరిగింది. తన సర్వసం దారబోసి కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితాన్ని వెండితెరపై అవిస్కారించారు గుణశేఖర్. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత హిట్ అయ్యింది అనే మాట పక్కన పెడితే.. ఇదో గొప్ప ప్రయత్నం. స్త్రీ సాధికారతను ప్రపంచానికి చాటి చెప్పిన కాకతీయ వీరనారి రుద్రమదేవి చరిత్రను సినిమాగా రూపొందిచడం అభినందనీయం. అయితే ఈ సినిమా విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ సవతి తల్లి ప్రేమను చూపించింది.
ఎంతో వ్యయప్రయాసలతో తెలుగు సామ్రాజ్యం చెందిన ఓ మహా వీరనారి చరిత్రను తెరపై ఆవిష్కారించానని, దీనికి పన్ను రాయితీ ఇవ్వాల్సిందిగా ఏపీ, తెలంగాణా ప్రభుత్వాల్ని దర్శకుడు విజ్ఞప్తి చేయగా.. తెలంగాణా ప్రభుత్వం వెంటనే పన్ను రాయితీ ఇచ్చిందని, అయితే ఏపీ ప్రభుత్వం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా రాయితీపై కమిటీ ఏర్పాటు చేసి చివరి ఫైల్ ముసేశారు తప్పితే.. ప్రోత్సహం లభించలేదు.
ఇప్పుడు ఈ సినిమాకి మరోసారి అన్యాయం జరిగింది. నంది అవార్డుల విజేతల లిస్టులో ఈ సినిమా లేదు.చివరికి జ్యూరీ అవార్డు కూడా ఇవ్వలేదు. దీనిపై గుణశేఖర్ నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాడు. నంది అవార్డుల విషయంలో ఎవరు ప్రశ్నించినా వాళ్లని మూడేళ్లపాటూ అవార్డులకి అనర్హులుగా ప్రకటిస్తారని విన్నాను. అసలు మనం ఏ దేశంలో ఉన్నాం.. మర్చిపోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులిచ్చి గుర్తుచేయడం ఎందుకనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించారా? అదే అయితే ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఆవేదనే కాదు. ఇందులో నిరసన కూడా. ఆ నిరసనలో అర్ధం వుంది.
నిజానికిసారి నంది అవార్డుల జాబితాను చూస్తే సిత్రంగా వుంది. పరమ రొడ్డకొట్టుడు సినిమాలకు నందులు ఇచ్చేశారు. ఆ సినిమాలతో పోల్చుకుంటే.. రుద్రమదేవి దేనికీ తక్కువ కాదు. అలాంటిది ఒక్క అవార్డ్ కూడా రాకపోవడం ఖచ్చితంగా అన్యాయమే. హీరో ఒక్క గుద్దు గుద్దితే వందమంది మట్టిలో కలిసిపోయే సినిమా తీసిన దర్శకుడు ఉత్తమ దర్శకుడు అయిపోయాడు. ఒక చరిత్రను అర్ధం చేసుకొని పరిశోధించి, స్టీరియోస్కోపిక్ 3డి అనే టెక్నాలజీ వాడి కోట్ల ఖర్చు చేసి ఒక చరిత్రను చూపించాలి. ఈ తెలుగు నేల ఎంత గొప్ప వీరులకు జన్మ నిచ్చిందో చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు కనిపించకుండాపోయాడు నంది జ్యూరీకి. మరి ఒక జెన్యున్ ప్రయత్నంను అభినందించే కళా హృదయం కరువైపొయిందా? ఖచ్చితంగా కరువైపొయిందనే చెప్పాలి. అందుకే గుణశేఖర్ ఆవేదనలో అర్ధం వుంది.
రుద్రమదేవిపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మొదటి నుండి ఒక విమర్శ వుంది. రుద్రమదేవి అంటే తెలంగాణ ప్రాంత చరిత్ర కదా మనకెందుకు అని ఏపీ ప్రభుత్వం, అధికారులు వ్యవహరించేలా కనిపించింది. ఒకసారి దర్శకుడు గుణశేఖర్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఏపీ సర్కార్ వైఖరి మరోసారి బయటపడింది. ఇదీలానే కొనసాగితే.. రాష్ట్రాలు వేరైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక్కటే అని అ చెప్పుకునే పెద్ద మనుషులు. ఇకపై తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవాలి.
అయితే ఇక్కడ కేసిఆర్ సర్కార్ ను అభినందించాలి. అమరావతి చరిత్ర అయినా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’కి మరో ఆలోచన లేకుండా పన్ను రాయితీ ఇచ్చి కళా హృదయం చాటుకున్నారు కేసీఆర్. మరి రుద్రమదేవి విషయంలో మాత్రం ఏపీ సర్కార్.. ఎందుకిలా వ్యవహరిస్తుందో…