అప్పట్లో ఓ పైన్ మాణింగ్..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ ఫైన్ మాణింగ్.. రహస్యంగా ఢిల్లీకి పోయి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. బయటకు వచ్చి ఓ ఏపీ ప్రయోజనాల కోసమే భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపన పత్రం అంటూ.. ఓ లేఖను మీడియాకు ఇచ్చారు. కానీ.. తర్వాత ఓ దినపత్రిక.. అసలు మోడీకి ఇచ్చిన లేఖంటూ.. ఓ పత్రాన్ని బయటపెట్టింది. దాంతో ఏముందంటే..” హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వాళ్లు చంద్రబాబు ఏజెంట్లు. వారిపై చర్యలు తీసుకోండి..” అనే మ్యాటర్ ఉంది. దీనిపై అప్పట్లోనే గగ్గోలు రేగింది.
కొన్నాళ్ల క్రితం ఓ “నాట్ పైన్” మాణింగ్..!
అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతిని ఇంక్లూడ్ చేస్తూ..కోర్టులో ఈడీ అదనపు చార్జిషీట్ దాఖలు చేసిది. ఆ వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. దాంతో జగన్మోహన్ రెడ్డి.. ఈ సారి అందరికీ తెలిసేలా.. బహిరంగలేఖ రాశారు. అందులోనూ.. ఆయన ప్రధానంగా ” ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వాళ్లు చంద్రబాబు ఏజెంట్లు.. ” అని చెప్పుకొచ్చారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ అధికారులను బెదిరించేలా.. వారి పేర్లు .. పెట్టి అటు ప్రధానితో పాటు.. ఇటు అందరికీ తెలిసేలా.. ఆరోపణలు చేయడం కలకల రేపింది. బీజేపీతో ఇప్పుడు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో.. ఈ మధ్య ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వాటిపై జగన్ వైపు నుంచి పెద్దగా ఫిర్యాదులు రావడం లేదు. పైగా.. ఇంకా సమర్థింపులు వస్తున్నాయి. తన దగ్గరకు వస్తే మంచివి కాదు… రాకపోతే మంచివన్నట్లుగా.. జగన్ శైలి ఉంది. అయితే.. ఈ ఈడీ విషయంలో.. జగన్‌కు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే… జగన్ చెబుతున్నా ఆ ఉమా శంకర్ గౌడ్, గాంధీలను… బదిలీ చేసేవారు. ఉమాశంకర్ గౌడ్‌ని కేరళకు బదిలీ చేశారు. కొత్తగా ఈడీకి కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిని నియమించారు. గాంధీని తన మాతృశాఖకు పంపించారు. గాంధీ డిప్యూటేషన్ మీద చాలా కాలంగా… ఈడీలో పని చేస్తున్నారని.. జగన తన లేఖల్లో చెప్పారు. ఇప్పుడు అదే కారణంతో.. ఆయనను.. కేంద్రం తన మాతృశాఖకు.. పంపించేశారు. మొత్తానికి ఈడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెగ్గిచుకున్నారు. ఎన్నికలకు ముందు… సుదీర్ఘ కాలంగా పోరాడిన ఓ అంశంలో విజయం సాధించారు. దీనికి ఆయన బీజేపీకి ధ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే.