తెలంగాణ సెక్రటేరియట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ప్రథమ పౌరురాలు గవర్నర్ ను ఆహ్వానించలేదు. కానీ ఆహ్వానించినా రాలేదని విమర్శలు చే్శారు. ఆహ్వానం పంపలేదని రాజ్ భవన్ గట్టిగా ఖండించిన తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు అదే బీఆర్ఎస్ సర్కార్ మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రపతికి గౌరవం ఇవ్వడం లేదని. కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభింపచేయడం లేదని.
2020లో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు భూమిపూజ చేసిన మోదీ.. ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే ఆ అధికారం మోదీకి ఎక్కడిదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కార్యనిర్వాహక అధికారం మాత్రమే ప్రధానికి ఉంటుందని.. శాసనవ్యవస్థపై పార్లమెంటుకు, న్యాయవ్యవస్థపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అధికారాలుంటాయి. మొత్తంగా ఈ మూడు వ్యవస్థలపై రాష్ట్రపతికి సర్వాధికారాలు ఉంటాయని అంటున్నారు.
ఏ రకంగా చూసినా పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి మాత్రమే ప్రారంభించాల్సి ఉంటుందని లాజిక్ చెబుతున్నారు. నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రారంభింపచేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. అయితే గవర్నర్ విషయంలో అసలు ప్రోటోకాల్ కూడా ఇవ్వని కేసీఆర్.. రాష్ట్రపతికి కేంద్రం ఇస్తున్న గౌరవ మర్యాదల గురించి మాట్లాడటం తేడాగా ఉందని బీజేప నేతలంటున్నారు.