ఇటీవలి కాలంలో తీవ్ర దుమారానికి కారణమైన నంది అవార్టుల వివాదంలో ప్రముఖ హీరో కృష్ణ మహేష్‌బాబుల కుటుంబం సంయమనం పాటించడం విశేషం. ఆ కుటుంబం తరపున రాజకీయాల్లో పాల్గొనే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అవార్డులపై పోసాని కృస్ణమురళి దాడిని తేలిగ్గా తీసి పారేశారు. ఇలాటి విమర్శలు వుంటూనే వున్నాయన్నారు.పోసాని ఎక్కువగా స్పందించాడని కూడా ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించడంతో పరిశ్రమలో పెద్ద భాగం ఆయనతో లేదని తేలిపోయింది. గతంలో దూకుడు సినిమాకు అవార్డు వచ్చినప్పుడు ఆదిశేషగిరిరావు కారణంగానే ఇచ్చారని ఆరోపణలు వినిపించాయి. వైఎస్ హయాంలోనూ మహేష్‌బాబు ఉత్సవానికి వస్తారనే మాటలు నమ్మి అవార్డులు ప్రకటించారని తీరా ఆయన రాకపోవడంతో ఆగ్రహించారని వార్తలు వచ్చాయి. కొన్ని ప్రభుత్వ ప్రకటనలు చేయడం వల్ల వైఎస్‌ను నాయకుడుగా అభినందించడం వల్ల నాగార్జున అప్పట్లో వైఎస్ కు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు పొందారు. నిజానికి అక్కినేని కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే వుంది. ఇప్పుడు వైసీపీకి అనుకూలమని అంటుంటారు. అయితే వారు కూడా అవార్డులపై పెద్ద విమర్శలు చేయలేదు. మోహన్‌బాబు ఒక్కరే గట్టిగా స్పందించినా మిగిలిన పెద్ద కుటుంబాలు మౌనంగా వుండిపోవడంతో నందులు గట్టెక్కినట్టే.
అయితే మరింత జాగ్రత్తగా బహుమతుల ఎంపిక జరిగివుండాలనే భావన టిడిపి వారిలోనూ వుంది. వారికి అనుకూలురైన సినిమా వారిలోనూ వుంది. అయితేౖ మరీ అతిగా రచ్చ చేస్తే అవార్డులు పూర్తిగా విలువ కోల్పోతాయనీ వాటివల్ల వచ్చే ఉత్సాహం కూడా అడుగంటి వివాదాలు మిగులుతాయని పపరిశ్రమ వర్గాలు అనుకుంటున్నాయి.