వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు ఇచ్చి … ప్రధానమంత్రి ఒప్పుకోలేదన్న కారణంగా… ఆర్థిక శాఖ వెనక్కి తీసుకున్న విషయం మనకు ఇప్పటి వరకూ తెలుసు. ఆ నిధులు ఇప్పటి వరకూ ఇవ్వలేదు..! కానీ.. ఏపీ ఖాతాలో వేసి… మరీ వెనక్కి తీసుకున్నారు కాబట్టి.. ఆ విషయం తెలిసింది. కానీ… ఏపీకి ఇవ్వడానికి రెడీగా ఉండి… పీఎంవో పర్మిషన్ లేదన్న కారణంగా ఆగిపోయిన మొత్తం రూ. 32వేల కోట్లట. ఈ విషయాన్ని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు.. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులే చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు..పనిలో పనిగా.. ఏపీకి రావాల్సిన నిధుల గురంచి ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఏ మూడ్ లో ఉన్నారో కానీ… ఓ నిజం చెప్పేశారు. చట్టం ప్రకారం. లెక్కల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ కు 32వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని.. ఆ లెక్కలు రెడీ చేశామని.. కానీ ప్రధానమంత్రి అనుమతి కావాల్సి ఉందని… చెప్పారు.
తొలి ఏడాది లోటును కేంద్రం భర్తీ చేయాల్సి ఉంది. 2014-15 రెవెన్యూ లోటు 16,000 కోట్లుగా కాగ్ నిర్ధారించింది. కానీ కేంద్రం మాత్రం 3,979 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ ఖాతాలో 12 వేల కోట్లు రావాల్సి ఉంది. పోలవరంపై ఖర్చు పెట్టిన సొమ్ము, వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఇవ్వాల్సిన 90 శాతం నిధులను కూడా కలిపితే కేంద్రం నుంచి రాష్ట్రానికి 32,000 కోట్లు తక్షణం రావాల్సి ఉందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు విడుదల చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం కానీ… ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని.. ఆర్థిక సాఖ అధికారులు నేరుగానే చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉందని గతంలోనే తేలిపోయింది. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన 350 కోట్లను ప్రధానమంత్రి కార్యాలయం అంగీకరించలేదని చెప్పి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే సమాధానం వచ్చింది..
ముఖ్యమంత్రి కూడా… ఈ విషయాన్ని జన్మభూమి సభలో ప్రస్తావించి మోడీ తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు రావాలంటే.. ప్రధానమంత్రి మనసు అయినా మారాలి.. లేకపోతే.. ప్రధాని పదవిలో ఏపీకి అనుకూలంగా ఉండే నేత అయినా రావాల్సి ఉందనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఏపీలో బీజేపీకి ఓట్లు , సీట్లు లేవు కాబట్టి.. ఆయన మనసు మారే అవకాశం లేదు. ఇక ఉన్న ఒకే ఒక్క ఆప్షన్.. ఆయనను మార్చడమే..!