దేశంలో ఎప్పుడు ఏ టెర్రరిస్ట్‌ని శిక్షించినా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే వాయిస్ ఒకటి ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఆయనే శ్రీ అసదుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ ఎంపి. ఈయన తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ కూడా అన్నకు ఏమీ తీసిపోడు. ఆ మధ్య ఓ సభలో ఐదు నిమిషాలు టైం ఇస్తే ఏదో పీకేస్తాం అంటూ వాగేసి తీవ్రవిమర్శలు ఎదుర్కొన్నాడు. అత్యంత ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే అంతటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇఫ్పటి వరకూ మన చట్టం ఆయనను ఏమీ చేయలేకపోయింది. ఆయన మాట్లాడిన మాటల వీడియో ఇఫ్పటికీ కూడా నెట్లో దర్శనమిస్తూనే ఉంది. అందరికీ కనిపిస్తోంది. మరి మన పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు? చట్టం ఆయనకు చుట్టం ఎందుకవుతోంది? కనీసం దేశ్భక్త్స్ అని అస్తమానూ చెప్పుకుంటున్న పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అక్బరుద్దీన్ కేసు అడుగు కూడా ముందుకు ఎందుకు కదలడం లేదు అన్న ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం…. అదే మత రాజకీయం. కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాలు ఆడేవాళ్ళకంటే శక్తిమంతులు ఇండియాలో ఇంకెవ్వరూ ఉండరేమో. ఎప్పుడైనా, ఎవ్వరినైనా, ఏమైనా తిట్టే రైట్స్ వీళ్ళకు ఉన్నంతగా ఇంకెవ్వరికీ ఉండవు.
కులం, మతం, ప్రాంతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్న నాయకులందరివీ డ్రామాలే అనడంలో సందేహమే లేదు. అది కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆడుతున్న డ్రామాలు. ఈ మధ్య కాలంలోనే దేశంలోనూ, రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న ముస్లిముల స్థితిగతులు ఎంత అధమస్థాయిలో ఉన్నాయి అన్న విషయాన్ని ఓ సర్వే తేల్చిచెప్పింది. ఆ వివరాలన్నింటినీ అన్ని ప్రముఖ మీడియా సంస్థలూ సవివరంగా ప్రజలకు అందించాయి. ఒవైసీ బ్రదర్స్ కూడా ఆ వార్తలు చదివే ఉంటారు. కానీ ఆ విషయంపై వాళ్ళ స్పందన మాత్రం ఎక్కడా కనిపించలేదు. అలాగే కర్నూలుకు వరదలొచ్చినప్పుడు అక్కడున్న ముస్లింలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ఒవైసీలు కనీస మాత్రంగా కూడా సహాయం చేసింది లేదు. ఇక మూడు దశాబ్ధాలకు పైగా ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఒవైసీలు ఏలుతున్న హైదరాబాద్‌లో ఉన్న ముస్లిముల స్థితిగతులు ఏమాత్రం అభివృద్ధి చెందాయో అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా పాతబస్తీవాసుల దీనావస్థలు అయితే వర్ణనాతీతం. వాళ్ళ కష్టాలను తెలుసుకుందామనుకున్న రాజకీయనాయకులకు పాతబస్తీలోకి ప్రవేశం ఉండదు. మీడియాకు కూడా నో ఎంట్రీ. సామాన్య జనాలకు ఒవైసీలు చేసేది ఏమీ ఉండదు. కానీ గొడవలు, అల్లర్లలో పాల్గొనేవాళ్ళను పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం క్షణాల్లో పోలీస్ స్టేషన్‌కి వచ్చి వాళ్ళను విడిపించేస్తూ ఉంటారు. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి వాళ్ళందరూ సాధారణ ముస్లిం ఓటర్లను భయపెట్టేస్తూ ఉంటారు. ఇంకో పార్టీని ఎదగనివ్వరు. పనీపాటా లేకుండా తిరిగే ఇలాంటి వాళ్ళతో పాటు టెర్రరిస్టులకు కూడా ఒవైసీలు బ్రహ్మాండమైన సపోర్ట్ ఇస్తూ ఉంటారు. హైదరాబాద్‌లో అల్లర్లకు పాల్పడిన టెర్రరిస్టులకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ వార్త వెలువడిన వెంటనే ఒవైసీ రెడీ అయిపోయాడు. తనకు తోచిన విధంగా టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడేశాడు. మరి ఇదే ఒవైసీ సాధారణ ముస్లిముల తరపున ఎందుకు పోరాడరు? అందరు కుల, మత, ప్రాంత నాయకుల్లాగే రిజర్వేషన్స్ పాట పాడడం తప్పితే ముస్లిముల విద్య, వైద్య సౌకర్యాల కోసం ఎందుకు ఫైట్ చేయరు? అయినా మూడు దశాబ్ధాలుగా ఒకే కుటుంబ సభ్యులు ఎంపిగా గెలుస్తూ ఉన్నప్పటికీ ఇంకా ఆ నియోజకవర్గం వెనకబడి ఉందంటే, మరీ ముఖ్యంగా తాము ఎవరి అభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నాం అని చెప్పుకుంటున్నారో ఆ వర్గం వారే అందరికంటే ఎక్కువగా వెనుకబడి ఉన్నారంటే, ఇక ఆ కుటుంబ సభ్యులు ఏం పనులు చేసినట్టు? ఎవరి అభివృద్ధి కోసం పాటు పడినట్టు? హైదరాబాద్‌లో ఉన్న ముస్లిముల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయంటే ఆ బాధ్యత ఒవైసీలది కాక మరి ఎవరిదని అనుకోవాలి. ముందు తమను ఎంపిగా, ఎమ్మెల్యేలుగా గెలిపించిన ప్రజలను అభివృద్ధి చేసి ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ విషయాల గురించి స్పందిస్తే బాగుంటుందేమో.