పవన్ మూడ్ మొత్తం రాజకీయాలపై ఉంది. పవన్ కూడా ‘నేను ఇప్పట్లో సినిమాలు చేసేది లేదు’ అంటూనే ఉన్నాడు. కానీ ఎక్కడో ఏదో ఆశ. మైత్రీ మూవీస్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం, సంతోష్ శ్రీన్వాస్ కథ సిద్ధంగా ఉండడంతో పవన్ మళ్లీ సినిమా చేస్తాడేమో అనిపించింది. నెల రోజుల క్రితమే.. సంతోష్ శ్రీనివాస్ పవన్‌తో టచ్‌లోకి వచ్చాడు. దాతో ‘ఎన్నికలకు ముందు మరో సినిమా ఉంటుంది’ అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కాకపోతే పవన్ సినిమాల విషయంలో మరోసారి వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి పవన్ సిద్ధంగా లేడని సమాచారం. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయే పరిస్థితికి వచ్చింది.
సంతోష్ క్యాలిబర్పై పవన్‌కి నమ్మకాలు లేవన్నది పవన్ సన్నిహితుల నుంచి వినిపిస్తున్నమాట. అదీ నిజమే.. సంతోష్‌కి ఊదరగొట్టే విజయాలేం లేవు. ఆయన ఖాతాలో రభస అనే అట్టర్ ఫ్లాప్ కూడా ఉంది. కొత్త వాళ్లతో, ఫ్లాపులు ఉన్నవాళ్లతో రిస్కులు చేయడం పవన్‌కి అలవాటే. కాకపోతే ఇప్పుడు అలాంటి రిస్క్ తీసుకునే పొజీషన్లో మాత్రం పవన్ లేడు. అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయి.. పవన్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమా ఫ్లాప్.. రాజకీయంగానూ పవన్‌పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. చేతిలో ఓ హిట్‌తో జనాల ముందుకు వెళ్తే ఆ స్పందన వేరుగా ఉంటుంది. పవన్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడంటే కారణం అదే. కానీ సంతోష్ స్క్రిప్టుతో పవన్ సంతృప్తి చెందలేదని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఫ్లాప్ ఇవ్వడం కంటే, సినిమా చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నాడని తెలుస్తోంది. ఈలోగా ఎవరైనా మంచి కథతో టెమ్ట్ చేస్తే మాత్రం.. ఆ సినిమా చేయాలని పవన్ భావిస్తున్నాడట. అంతే తప్ప… కథ విషయంలో తప్పు చేయకూడదని డిసైడ్ అయ్యాడని టాక్. అందుకే సంతోష్ శ్రీనివాస్ సినిమా విషయంలో పవన్ వెనకడుగు వేసినట్టు సమాచారం.
అభిమానులు మాత్రం పవన్ నుంచి మరో సినిమా ఆశిస్తున్నారు. వాళ్లకు అర్జెంటుగా ఓ బ్లాక్ బ్లస్టర్ కావాలి. అభిమానుల ఆశలు, అంచనాలూ దృష్టిలో ఉంచుకుని పవన్ ఓ తెలివైన అడుగు వేస్తే బాగుంటుంది.