ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు.. పాదయాత్రలో ఉన్న జగన్తో సమావేశం కావడం… రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. తన రాజకీయ ప్రవేశంపై.. ఆయన జగన్ క్యాంప్ దగ్గర ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. కానీ .. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. తన సహజసిద్ధమైన అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సాంబశివరావు త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని ప్రారంభించి.. ఆయన రాకతో… వైసీపీ ఎలా బలపడబోతోందో కానీ.. చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు హైలెట్ కావడంతో… సాంబశివరావు స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని.. తాను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నానని.. రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు.
జగన్తో సాంబశివరావు.. మర్యాదపూర్వకంగా కలవాల్సిన అవసరం ఏమిటన్నదానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి సాంబశివరావు డీజీపీగా ఉన్నప్పుడు.. ఆయనపై… వైసీపీ ఓ రేంజ్లో విమర్శల దాడి చేసేది. సాంబశివరావును అడ్డం పెట్టుకుని చంద్రబాబు.. పోలీస్ రాజ్యం చేస్తున్నారని ఆరోపించేవారు. అలాంటి సాంబశివరావు.. నేరుగా జగన్ను వచ్చి కలవడానికి.. మర్యాద పూర్వకమైన కారణాలు ఏముంటాయన్న ప్రచారం జరుగుతోంది. తన పదవీ కాలంలో.. తన పనితీరును తీవ్రంగా తప్పు పట్టిన పార్టీ అధినేతను.. ఏ “మర్యాద” కారణాలతో కలిశారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ విషయంలో విజయసాయిరెడ్డి చూపించిన ఉత్సాహం.. మరీ అతిగా ఉంది. సాంబశిరావు.. జగన్తో భేటీ తర్వాత వెళ్లేటప్పుడు.. తాను స్వయంగా కారు డోర్ తీసి… సాగనంపారు. ఆ వెంటనే.. ఆయన పార్టీలో చేరబోతున్నట్లు చెప్పుకున్నారు. అంటే.. సాంబశివరావు.. రాజకీయాలపై ఆసక్తితో ఉన్నట్లేనని.. సీటు విషయంలో క్లారిటీ రాకనే… మాజీ డీజీపీ ఖండిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అది ఎంత వరకూ నిజమో కానీ.. సాంబశివరావు బ్యాక్గ్రౌండ్.. చూసి.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసిన వారికి మత్రం నమ్మశక్యంగా ఉండటం లేదు.