ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పట్టు లేకుండా పోయింది. వివిధ మంత్రిత్వ శాఖలో జరుగుతున్నదేమిటో ఆయనకు తెలియడం లేదు. వివాదాలు వచ్చిన తర్వాత సర్దుకోవడం… ఆ నిందను రేవంత్ భరించడం కామన్ గా మారిపోయింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారంలో రేవంత్ పైనే మరక పడుతోంది. కొత్త బ్రాండ్ల విషయంలో ప్రభుత్వ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారింది.
కొత్తగా ఎలాంటి లిక్కర్ బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని మంత్రి జూపల్లి ప్రకటించిన రెండు రోజుల్లోనే అది అబద్దమని తేల్చే ఉత్తర్వులు బయటకు వచ్చాయి. దాంతో తనకు తెలియకుండా ఉత్తర్వులువ చ్చాయని జూప్లలి చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ బ్రాండ్లను ఏపీతో పోల్చి.. .రేవంత్ కూడా అలాంటి స్కామ్ చేస్తున్నారని విమర్శించడం ప్రారంభించారు. దీంతో వాటి అనుమతులను ఆపేశారు. అసలు మంత్రి తనకు తెలియదంటారు.. మంత్రికి తెలియకుండా అంత కీలక నిర్ణయాలు లతీసుకుంటారా అంటే స్పష్టత లేదు.
ఒక్క ఎక్సైజ్ శాఖలోనే రేవంత్ కు తెలియకుండానే చాలా జరిగిపోతున్నాయి. నీటి పారుదల మంత్రి ఉత్తమ్..కాళేశ్వరం విచారణ ఎపిసోడ్లో ఎన్ని పిల్లి మొగ్గలేశారో చెప్పాల్సిన పని లేదు. పలు శాఖల్ని సీనియర్లు నిర్వహిస్తున్నారు. వారికి రేవంత్ సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం లేదు. వారి శాఖల్లోనే వివాదాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్నింటికీ బాధ్యుడు. కానీ ఆయన ప్రభుత్వంపై పట్టు పెంచుకోవడానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఫలితంగా లిక్కర్ బ్రాండ్ల వంటి వివాదాలు తెరపైకి వస్తున్నాయి.