హోమ్‌లోన్‌కు అప్లయ్ చేస్తే ఎన్ని రకాల ఫీజులు కట్టాలో తెలుసా ?

ఇప్పుడు కొనే ప్రతి ఇల్లు హోమ్ లోనే. పూర్తిగా డబ్బులు పెట్టి కొనేవారి సంఖ్య స్వల్పంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయాల కంటే ఎక్కువగా.. రాకెట్ వేగంతో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. ఓ అపార్టుమెంట్ ను బిల్డర్ నిర్మిస్తే అందులో 95 శాతం మంది … హోమ్ లోన్ తోనే కొంటారు. అందుకే చాలా సంస్థలు ముందుగానే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో అసోసియేట్ అయిపోయి ఉంటాయి, అయితే ఈ హోమ్ లోన్ ప్రాసెస్ చిన్నది కాదు. అలాగే ఈ ప్రాసెస్ లో ప్రతి అడుగులోనూ ఫీజులు చెల్లించాలి. అందరూ ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలనుకుంటారు. కానీ లెక్కలేనన్న రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

సాధారణంగా దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. కొన్ని బ్యాంకులు ఇతర రూపంలో ఫీజులు పిండుకుని ప్రాసెసింగ్ ఫీజు రద్దు అనే ఆఫర్లు ప్రకటిస్తాయి. హోమ్ లోన్‌కు అప్లయ్ చేసినప్పుడు మొదట లాగిన్ ఫీజు కట్టాలి. ఇది నాన్-రిఫండబుల్ ఫీజు. బ్యాంకుల్ని బట్టి గరిష్టంగా రూ.6,500 వరకు వసూలు చేస్తాయి. స్టాంప్ పేపర్‌ వంటి లీగల్ డాక్యుమెంట్లను సిద్ధం చేయడానికి చార్జీలు చెల్లించాలి

హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు క్రెడిట్ స్కోర్‌ను చెక్ చేస్తారు. క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించడానికి.. క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ రిపోర్టును పొందడానికి అయ్యే ఖర్చు భరించాలి. హోమ్ లోన్ కోసం మీ ఆదాయ పన్ను ధ్రువీకరణ పత్రాన్ని రుణదాతకు చూపించాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ అగ్రిమెంట్ కాపీ, టైటిల్ డాక్యుమెంట్, డూప్లికేట్ స్టేట్‌మెంట్ వంటి వాటితో సహా ఇతర డాక్యుమెంట్లు సేకరించడానికి కొద్దిపాటి ఫీజులు, ఛార్జీలు చెల్లించాలని బ్యాంగులు అడగవచ్చు.

హోమ్ లోన్ ప్రక్రియలో ఫిజికల్ ప్రాపర్టీ తనిఖీ కీలకం. ఆస్తి విలువను నిర్ణయించడానికి, లోన్ మొత్తాన్ని ఆమోదించడానికి బ్యాంకులు, హోమ్ లోన్లు ఇచ్చే సంస్థలు ఆస్తిని తనిఖీ చేస్తాయి. వీటికయ్యే ఖర్చుతో పాటు మెమోరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ ఛార్జీ చెల్లించాలి. ఇవి కాక మరికొన్ని కనిపించని చార్జీలు వసూలు చేస్తారు. హోమ్ లోన్ తీసుకునే క్రమంలో ఇవన్నీ పెద్దగా అనిపించకపోచ్చు కానీ.. కొన్ని సంస్థలు మాయ చేస్తూంటాయి. అందుకే హోమ్ లోన్ ఎంక్వయిరీకి ముందే పూర్తి స్థాయిలో చార్జీల గురించి ఎంక్వయిరీ చేసుకోవడం బెటర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close