పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు పెద్దలు. దేవ దేవుడికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని భక్తులంతా అనుకుంటున్నారు. ఎందుకంటే దేవుడికి అపచారం చేసింది మనుషులే. అ మనుషులు ఎవరన్న సంగతి తర్వాత. అందుకే దేవుడి ప్రాయశ్చిత్తం చేసేందుకు భక్తులు ఎవరికి తోచిన రీతిలో వారు పూజలు చేస్తున్నారు. దీక్షలకు సిద్ధమవుతున్నాయి. అయితే అసలు ఈ పని చేసిన వారు మాత్రం… కనీసం పశ్చాత్తాపం చెందడం లేదు. ఇక ప్రాయశ్చిత్తంకు చాన్స్ ఎక్కడ ఉంటుంది ?
పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్ ప్రాయశ్చితంగా తిరువూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఇతర నేతలుకూడా అదే బాటలోకి వెళ్తున్నారు. కానీ తప్పు ఒప్పుకుని.. దేవుడికి ప్రాయశ్చిత్తం చేయాలనే పశ్చాత్తాపానికి మాత్రం అసలు తప్పుడు పని చేసిన వాళ్లకు రావడం లేదు. ఇతర రాజకీయ అంశంలాగే ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చేసిన తప్పుడు పనిని బయట పెట్టడమే తప్పని.. వాదిస్తున్నారు. వీరి వ్యవహారం సామాన్యుల్ని మరింతగా విస్మయానికి గురి చేస్తోంది.
ఐదేళ్ల పాటు జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రతి చిన్న తప్పును బయట పెట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంతకు మించిన సంచలన విషయాలు ముందు ముందు బయటకు రాబోతున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అసలు అవి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉంటాయని అంటున్నారు. జెత్వానీ కేసు, లడ్డూ అపచారం తర్వాత… మద్యం స్కాంతో ఎలా ప్రజల్ని చంపేశారో త్వరలో బయట పెట్టబోతున్నట్లుగా తెలుస్తోది. ఏ విషయంలోనూ వైసీపీ నేతలకు పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే.. వారి మైండ్ సెట్ వేరేలా ఉంటుది.