వివేకానందరెడ్డిని ఎలా చంపారు ?. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేశారు. గొడ్డలితో తలపై నరికారు. తర్వాత ఎవరూ రాక ముందు వచ్చి సాక్ష్యాలు తుడిచేశారు. తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారు. తర్వాత గుండెపోటు అన్నారు. తర్వాత దుండగులు వచ్చి నరికి చంపారని ప్రచారం చేశారు. హత్యపై అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన కుమార్తె, అల్లుడిపైనే కుట్ర చేసి వారే చంపించారని ప్రచారం చేశారు.
అచ్చంగా ఇదే సీక్వెన్స్‌లో అవనిగడ్డలో శ్రీహరి అనే డాక్టర్ హత్య విషయంలో కూడా జరిగింది. అప్పట్లో ప్రచారంలోకి రాలేదు కానీ ఇప్పుడు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఈ అంశాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి సీఐడీ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడంతో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది.
డాక్టర్ కోట శ్రీహరి అవనిగడ్డలోని ఇంట్లో ఉన్నప్పుడు 2020 నవంబర్‌లో అర్థరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన ఆ సమయంలో ఒంటరిగా ఉన్నారు. మొదట రక్తపు వాంతులని ప్రచారం చేశారు. తర్వాత గుండెపోటు అన్నారు. తర్వాత దొంగలు వచ్చి చంపేశారని అన్నారు. పోలీసులు ముఖ్యంగా ఎస్పీ వచ్చి చూసి.. దొంగలు చంపేశారని తేల్చి.. ఆదొంగలెవరో ఆధారాలు దొరకలేదని తీర్మానించి వెళ్లిపోయారు. ఈ హత్యపై ఆయన కుమారుడు ప్రవీణ్ అనుమానాలు వ్యక్తం చేస్తే.. ఆయన మీదనే డౌట్ గా ఉందని హడావుడి చేసిన పోలీసులు డీఎన్ఎ టెస్టులు చేయించారు. దాంతో ఎక్కడ తనను ఇరికిస్తారోనని ఆయన సైలెంట్ అయిపోయారు.
దానికి తగ్గట్లుగానే పోలీసులు ఆ కేసును కోల్డ్ స్టోరేజీలో పడేశారు. అసలు విషయం ఏమిటంటే ఈ శ్రీహరి, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ వ్యాపారభాగస్వాములు, ఇద్దరిమద్య తేడాలు వచ్చాయి. ఈ క్రమంలోనే హత్య జరిగింది. పోలీసులు కన్వీనియంట్ గా అన్నీ మర్చిపోవడంతో కేసు మూలనపడింది. అచ్చం వివేకా ప్లాన్ నే ఎలా అమలు చేశారు ?. అసలు ఏం జరిగింది ?. సీఐడీ విచారణలో అయినా బయటకు వస్తాయా?