తెలంగాణ బీజేపీ నేతలను ఢిల్లీకి పిలిపించిన అమిత్ షా వారికి ఓ సీక్రెట్ చెప్పారు. అదేమిటంటే… తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లవచ్చని.. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని. దీంతో బీజేపీ నేతలు అలర్టయ్యారు. ఇటీవల కేంద్రంతో వరుస చర్చల్లో కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి చర్చిచారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే ఎన్నికలు జరగవు. ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాలి. మామూలుగా అయితే అసెంబ్లీ రద్దు చేసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు పెడతారు. అది ఎక్కువ సమయం అవుతుంది.
గతంలో ముందస్తుకు వెళ్లినప్పుడు.. ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా ఎన్నికల ప్రకటన వచ్చేలా చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఈ సారి కూడా అదే బాటలో వెళ్తారని చెబుతున్నారు. దీనిపై కేంద్రానికి సమాచారం ఉండటంతోనే అమిత్ షా తమ పార్టీ నేతలతో అలా చెప్పారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు తర్వాత కేసీఆర్ ముందస్తుకు వెళ్లబోతున్నారని కొద్ది రోజులుగా తెలంగాణలో ప్రచారంలో ఉంది.దానికి తగ్గట్లుగానే ఆయన ఆ సమయానికల్లా పథకాలన్నీ వీలైనంత వరకూ పూర్తి చేయాలని షెడ్యూల్ రూపొందించుకున్నారు. దళిత బంధు పథఖాన్ని నియోజకవర్గానికి వంద మందికి ఆ లోపు ఇవ్వాలని అనుకుంటున్నారు.
హుజురాబాద్లో సానుకూల ఫలితం వచ్చినట్లయితే అలా చేసి ఉండేవారని.. కానీ రాకపోవడంతో వెనక్కి తగ్గుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది.అయితే ఎంత ఆలస్యం అయితే అంత నషఅటంజరుగుతుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నారన్న మరో అభిప్రాయం కూడా ఉంది. మొత్తంగా చూస్తే అమిత్ షా.. ఆషామాషీగా తమ పార్టీ నేతలకు ముందస్తు ఎన్నికల గురించి చెప్పరన్న అభిప్రాయంలో బీజేపీ నేతలున్నారు.