ఏపీలో శాంతి భద్రతలపై అదుపు తప్పాయని ఢిల్లీలో వైసీపీ ధర్నాకు రెడీ అయింది. శాంతి భద్రతలు ఎంతలా అదుపు తప్పాయో ప్రపంచం ముందుంచేందుకు హస్తినలో ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు పార్టీలను ఈ ధర్నాకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు.మొదట కమ్యూనిస్టు పార్టీలను సపోర్ట్ కోరినా వారు మద్దతు ప్రకటించలేదు.
ఆ తర్వాత తమ ధర్నాకు మద్దతు తెలపాలని ఏకవాక్యంతో అన్ని పార్టీల మద్దతూ కోరింది వైసీపీ. కానీ ఏ పార్టీ నుంచి వైసీపీ చేపడుతున్న ధర్నాకు మద్దతు లభించడం లేదు. వైసీపీ రాజకీయం బహుశా అన్ని పార్టీలకు తెలిసినట్లు ఉంది. అందుకే మద్దతు తెలిపేందుకు ఏ పార్టీ ముందుకు రావడం లేదు. ఇక, వైసీపీకి ప్రధాన మిత్రపక్షంగా ఉండే బీఆర్ఎస్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read : కేంద్ర బడ్జెట్ పై వైసీపీ సైలెన్స్ ..ఎందుకు?
వైసీపీ ధర్నాకు మద్దతు ఇవ్వాలని ప్రత్యేకంగా బీఆర్ఎస్ ను కోరారో లేదో క్లారిటీ లేదు. కానీ, అన్ని పార్టీలను మద్దతు ఇవ్వాలని కోరడంతో బీఆర్ఎస్ నూ మద్దతు అడిగినట్లే. దాంతో మరికాసేపట్లో జరిగే వైసీపీ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు ఎవరైనా పాల్గొంటారా..? అనేది చూడాలి. పలు విషయాల్లో వైసీపీకి సపోర్ట్ రోల్ పోషించే బీఆర్ఎస్ ఈ విషయంలోనూ అలాగే ఉంటుందా..? రాజకీయ కారణాలతో దూరం ఉంటుందా..? అనే చర్చ జరుగుతోంది.