తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని వెనకటికి ఒకడు చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని.. మా జగన్ అన్ననే అన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దొంగ అని కూడా ఒప్పుకుంటున్నామని వారికి అర్థం కాలేదు.
చంద్రబాబు ఏమన్నారో వీడియోలు మాత్రం పెట్జడం లేదు. కానీ పొగిడారంటూ పేపర్ క్లిప్లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి నిర్మించిన భవనం విషయంలో జగన్ వ్యహరించిన తీరును తప్పు పట్టారు. పర్యవరణ విధ్వంసాన్ని చేసింది కాకుండా జపాన్ టెక్నాలజీని తెచ్చి కొండ చరియలు పడకుండా కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటివన్నీ ఏ మాత్రం బాధ్యత లేని వ్యక్తులే చేస్తారని మండిపడ్డారు. జగన్ రెడ్డి నిర్వాకాన్ని ప్రజలకు చూపించాలని నిర్ణయించారు.
దీనికే చంద్రబాబు పొగిడితే జగన్ రెడ్డి జీవితానికి అంత కంటే గుర్తింపు ఉండదనుకుని అవే పొగడ్తలనుకుని ప్రచారం చేసేసుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాను ఎవరు డీల్ చేస్తున్నారో కానీ ఉదయం నుంచి జగన్ ను పొగిడిన చంద్రబాబు అంటూ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. వాటిని చూసి టీడీపీ కార్యకర్తలు నవ్వుకుంటూనే ఉన్నారు. అసలు చంద్రబాబు పొగిడారో తిట్టారో తెలుసుకోలేనంత అమాయకులు.. జగన్ పరువు తీస్తున్నారని కొంత మంది నిష్ఠూరమాడుకుంటున్నారు.