దేశం జమిలీ ఎన్నికల దిశగా నడుస్తోంది. మొన్న ప్రధాని జమిలీ జరిగి తీరాల్సిందేనన్నారు. నిన్న ఈసీ తాము రెడీగా ఉన్నామని ప్రకటించేసింది. ఇక రాజ్యాంగ సవరణ కోసం బీజేపీకి కావాల్సినంత బలం ఉంది. రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేకపోయినా… బిల్లులు పాస్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. జమిలీ ఎన్నికలు పెట్టాలి అనుకుంటే.. అడ్డుకునే శక్తి ఆ పార్టీలకు లేదు. మోదీ, షా అనుకుంటే… జమిలీ ఎన్నికుల ఖాయమే. రాజ్యంగసవరణ చేసి.. మిగతా లాంఛనాలు పూర్తి చేస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా మనది మెజార్టీ ప్రజాస్వామ్యం కాబట్టి… మోదీ, షాల మాటే నెగ్గుతుంది.
లా కమిషన్ ద్వారా.. రాజ్యాంగపరంగా చేయాల్సిన మార్పు,చేర్పుల గురించి ఇప్పటికే మోడీ నివేదిక తెప్పించుకున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలనూ తెలుసుకున్నారు. ఈ సారి జమిలీ ఎన్నికలు ఖాయమేనని అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందుకే వారంతా ఎన్నికల సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులున్నారు.. ఢిల్లీ, బెంగాల్ లాంటి.. ఒకటి,రెండు చోట్ల మినహా.. మిగతా అన్ని రాష్ట్రాల్లో నోరెత్తలేని ముఖ్యమంత్రులు ఉన్నారు. ఫలితంగా.. కేంద్రంపై.. తమ ప్రయోజనాల కోసం పోరాడే పరిస్థితులు కనిపించడం లేదు. జమిలీని వ్యతిరేకించే పరిస్థితి లేదు.
మన దేశం మెజార్టీ ప్రజాస్వామ్యం మీద నడుస్తోంది. ఢిల్లీ సర్కార్ ఏం చేస్తే.. దానికి అంగీకరించాల్సిందే. జమిలీ ఎన్నికల వల్ల ఏం జరగబోతోందో.. దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీలకూ ఓ అవగాహన ఉంది. జమిలీ ఎన్నికలు అనేవి..భారతీయ జనతా పార్టీ..తమ రాజకీయ పునాదులను.. అన్ని చోట్ల అత్యంత బలంగా వేసుకోవడంతో పాటు..ప్రత్యామ్నాయం లేకుండా చేయాలనే లక్ష్యంతో చేస్తోంది. ఈ విషయం తెలిసినా… ఏమీ చేయలేని స్థితిలోఇతర పార్టీలు ఉన్నాయి. అందుకే.. ఎన్నికలు కోరుకుంటున్న వారు రెడీ అవుతున్నారు. వద్దనుకుంటున్న వారూ రెడీ కాక తప్పడం లేదు.