కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేస్తూ కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఇక ప్రాజెక్టులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయారు. నోటిఫికేషన్లో పేర్కొన్నంత మాత్రాన.. అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు కాదని.. నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణం ఆపివేయాలన్నారు. ఏపీ ప్రభుత్వం నదీ బోర్డులను నోటిఫై చేయాలని అదే పనిగా కేంద్రానికి లేఖలు రాసింది కాబట్టి.. ఈ అంశంపై సంతృప్తిగానే ఉందని అనుకోవాలి. ప్రాజెక్టులను కేంద్ర పరిధిలోకి తీసుకోవాలని అదే పనిగా అడిగింది కాబట్టి.. ఏపీ విజ్ఞప్తిని కేంద్రం మన్నించిందనే అనుకోవాలి.
మరి తెలంగాణ స్ప్ందన ఏమిటి..?. అధికారికంగా ఇంత వరకూ.. తెలంగాణ సర్కార్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు కానీ.. మీడియాకు మాత్రం లీక ఇచ్చారు. తాము ఆగ్రహంగా ఉన్నామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని.. ఇంకా లేకపోతే.. ప్రధానమంత్రిని కలుస్తామని చెప్పుకొచ్చారు. త్వరలో కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉంటుందంటున్నారు. కానీ తెలంగాణ సర్కార్ కు కూడా.. ఈ పరిస్థితిని ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.
జల వివాదాల్లో అంతా కేంద్రమే చేసిందని.. చెప్పుకోవడానికి… తెలంగాణ సర్కార్కు అవకాశం చిక్కిందని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రాజెక్టులు పూర్తి చేసినా.. టీఆర్ఎస్ సర్కార్ పై విపక్షాలు విమర్శలు చేయడానికి అవకాశం ఉండదని అంటున్నారు. మొత్తానికి పైకి వ్యతిరేకత చూపిస్తున్నా… తెలంగాణ సర్కార్కు కొత్త డెవలప్మెంట్ కాస్త మేలు చేస్తుందన్న అంచనాలో ఉన్నారు.