తెలంగాణ రాష్ట్ర సమితిలో… నాయిని నరసింహారెడ్డి ప్రస్థానం ముగిసిందా..? ప్రగతి భవన్ నుంచి వస్తున్న ఫీలర్స్ ప్రకారం… నాయిని నర్సింహారెడ్డికి కేసీఆర్ కనీసం అపాయిట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ముషీరాబాద్ టిక్కెట్ ను .. కేసీఆర్ ముఠా గోపాల్ అనే నేతకు ఖరారు చేశారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా నాయిని నర్సింహారెడ్డి మాత్రం.. తనకు లేకపోతే.. తన అల్లుడికి టిక్కెట్ ఇవ్వాలని పట్టు బడుతున్నారు. కానీ.. కేసీఆర్ మాత్రం.. నాయిని మాటలు వినడానికి కూడా ఆసక్తిగా లేరు. రెండు సార్లు కేటీఆర్ మాత్రం.. “మీకు చెప్పే టిక్కెట్ ఇస్తాం” అన్నారు కానీ… మీకే ఇస్తామని చెప్పలేదు. దాంతో నాయిని నర్సింహారెడ్డికి సినిమా అర్థమైపోతోంది. మెల్లగా టోన్ పెంచడం ప్రారంభించారు.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండి కూడా టిక్కెట్ ఇప్పించుకోలేకపోయానన్న బాధను ఆయన తరచతూ బయటపెడుతున్నారు. నా కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. మీరు రండి గెలిపిస్తామంటూ అహ్వానిస్తున్నారు ’.. అని నాయిని తనకు వేరే ఆలోచనలు ఉన్నాయన్న విషయాన్ని నర్మగర్భంగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేయమని చెప్పి.. చివర్లో హ్యాండిచ్చారని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ నాకు అనుకూ లంగానే నిర్ణయం తీసుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నా.. ఆయనకు ప్రగతి భవన్ లోకి యాక్సెస్ తగ్గిపోయింది. కొద్ది రోజులుగా.. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డి.. కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాడన్న ప్రచారాన్ని.. టీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉన్న మీడియానే ప్రచారం చేస్తోంది. ఇదంతా.. టీఆర్ఎస్ నేతలే చేయిస్తున్నారని నాయిని అర్థమైపోయింది.
కొత్తగా నాయిని ఇష్యూలోకి రేవంత్ రెడ్డి వచ్చారు. వెన్నంటి ఉన్న నాయినిని కేసీఆర్ అవమానించారని విమర్శించారు. నెల రోజులుగా నాయినికి కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు.నియోజకవర్గం మారితే నాయినికి కేసీఆర్ రూ.10 కోట్లు ఇస్తాననడంపై.. సుమోటోగా స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. ఏ విధంగా చూసినా.. నాయిని నరసింహారెడ్డికి కానీ.. ఆయన అల్లుడికి కానీ టిక్కెట్ ఇవ్వాలనుకుంటే కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని.. ఇవ్వదల్చుకోలేదు కాబట్టే.. కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే.. కేసీఆర్ అదే తరహా ట్రీట్ మెంట్ ఇస్తాడని… నాయిని కూడా తెలుసు. కానీ ఆయనది దింపు కళ్లెం ఆశనేని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది.. !