ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. జగన్ రెడ్డిని విమర్శించనని కొంత కాలం కిందట చెప్పుకున్న ఆయన ఇప్పుడు టీడీపీతో కలిసి విమర్శించినట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నారు. వరుసగా వైసీపీ .. ఎలాంటి హామీలు పొందకుండానే బీజేపీకి మద్దతిస్తూండటంపై విమర్శలు వస్తూంటే… దాన్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి వచ్చారు. జగన్ ఎందుకు బీజేపీకి భయపడుతున్నారో అర్థం కావడం లేదు. జగన్ రెడ్డిపై ఉన్న కేసులు. వివేకా హత్య కేసుల గురించి తెలిసిన చిన్న పిల్లవాడైనా జగన్ రెడ్డికి మరో ఆప్షన్ లేదని చెబుతారు. కానీ ఉండవల్లి లాగింటి లిటిగేషన్ లాయర్‌కు మాత్రం అది తెలియనట్లుగా ఉంది.
ఏపీ ఎంపీలు పార్లమెంట్లో బీజేపీ కి సహకరిస్తున్నారన్నారు. అవిశ్వాస తీర్మానంలో ఏపీ గట్టిగా మాట్లాడాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై అవిశ్వాసంలో ఎంపీలు మాట్లాడాలన్నారు. టీడీపీకి ఉంది రాజ్యసభ, లోక్ సభ కలిసి నలుగురు అదే వైసీపీకి ముఫ్పై రెండు మంది ఉన్నారు. వారిని ప్రశ్నించాల్సిన ఉండవల్లి రెండుపార్టీలను కలిపి మాట్లాడేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గురంచి చెప్పకుండా రెండు పార్టీల్ని ఒకే గాటన కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఓ ఓటర్ గా ఆయన ఆగ్రహం.. రాజమండ్రిలో జరుగుతున్న వ్యవహారాలపై మాత్రం అసంతృప్తిని దాచుకోలేకపోయారు. రాజమండ్రి కంబాల చెరువు స్టోరేజ్ కెపాసిటీ తగ్గిస్తే లోతట్టు ప్రాంతాలను ముంచివేయటమేనని, మునిగిపోకుండా కాపాడాలన్నారు. రాజమండ్రిలో అనవసర పనులు చేపడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మొత్తంగా ఉండవల్లి ఏం మాట్లాడినా.. .. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను డైవర్ట్ చేయడానికే వస్తున్నారని.. రాష్ట్ర విభజన నాటి కన్నా… జగన్ రెడ్డి పాలనతోనే ఘోరమైన నష్టం జరుగుతున్నా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
గతంలో పోలవరంలో ఎలాంటి పగుళ్లు రాకపోయినా కొంత మంది పంపారంటూ ఫేక్ ఫోటోలతో ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ప్రాజెక్ట్ పరిస్థితి దారుణంగా ఉన్నా ఒక్క మాట మాట్లాడటం లేదు