మాజీ మంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ రేపు విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తన రాజకీయ గురువు తెదేపా ఎంపీ రాయపాటి సాంభశివ రావు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వారాల క్రితం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్దపడ్డారు. కానీ రాయపాటి సలహా మేరకు ఆయన ఆఖరు నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. కనుక ఆయనను తెదేపాలో చేర్చుకొనేందుకు రాయపాటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఒప్పించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తరువాత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీని వీడుతున్నారు. ప్రత్యేక హోదా అంశం భుజానికెత్తుకొని రాష్ర్టంలో మళ్ళీ పార్టీని బలపరుచుకొందామని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఒకరి తరువాత మరొకరు పార్టీ నుండి బయటకు జారిపోతూనే ఉన్నారు.