రాహుల్ గాంధీ తెలంగాణాలో పాదయాత్ర చేసిన తరువాత మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలోకి వెళ్ళిపోయారు. ఆయనతో బాటే మరో మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా వైకాపాలోకి జంప్ అయిపోయారు. రాహుల్ గాంధీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడా పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని తెదేపా నేతలన్నారు. వారు చెప్పినట్లుగానే రాహుల్ గాంధీ తన పర్యటన ముగించుకొని డిల్లీ చేరుకోగానే మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెదేపాలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ముందు ఆయన వైకాపాలో చేరాలనుకొన్నప్పటికీ ఆయన రాజకీయ గురువు రాయపాటి సాంభశివరావు వైకాపాలోకి వెళ్ళకుండా అడ్డుపడ్డంతో ఆగిపోయారు. ఆయన అడ్డుపడ్డారు కనుక ఆయనే డొక్కాకి తెదేపా తీర్ధం ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఒప్పించినట్లు తాజా సమాచారం. కనుక ఈనెల 15న డొక్కావారు తెదేపా తీర్ధం పుచ్చుకొనేందుకు ముహూర్తం పెట్టుకొన్నట్లు తెలుస్తోంది.