డాలర్ డ్రీమ్స్ అనగానే శేఖర్ కమ్ముల తీసిన సినిమా గుర్తొస్తుంది. అమెరికా మీద ఉన్న మోజుని అందంగా తెరకెక్కించాడీ అమెరికన్ రిటన్ డైరెక్టర్. అయితే అదంతా యువతకు అమెరికా మీద ఉన్న మోజు గురించే. కానీ అది యువత నుంచి టాలీవుడ్ కి కూడా పాకింది.
ఒకప్పుడు అమెరికాలో సినిమాని రిలీజ్ చేయాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. మెల్లమెల్లగా పెద్ద హీరోలు పాగా వేశారు. అక్కడ కూడా భారీ వసూళ్లు రాబడుతున్నారు. గత దశాబ్దానికి పైగా ఈ హవా నడుస్తోంది. అయితే కొత్తగా చిన్న నిర్మాతలు కూడా అమెరికా కల కంటున్నారు.
ఓ పది కోట్ల బడ్జెట్ తో సినిమా తీసేయడం. కొంచెం కొత్తగా ట్రే చేసి వర్కవుట్ అయితే చాలు కాసుల పంటే. ఇక అమెరికాలో కూడా తెలుగు వీరాభిమానులు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా బావున్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర క్యూ కడుతున్నారు. ఈ రకంగా ఓ చిన్న సినిమా వర్కవుట్ అయినా లాభాల పంట పండుతుంది.
ఆంధ్రా, నైజాం, సీడెడ్, ఓవర్సీర్ అంటూ లెక్కలు వేసుకున్న తర్వాతే చిన్న నిర్మాతలు సినిమాను ముందుకు తీసుకెళుతున్నారు. అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అంతా డాలర్ డ్రీమ్స్ కంటున్నారన్నమాట.