భారత్ కు నిధుల కష్టాలు తప్పేలా లేవు. ఖజానా క్రమంగా ఖాళీ అవుతుందన్న భయం కలుగుతోంది. ప్రస్తుతం మన దగ్గర 59 వేల 640 కోట్ల డాలర్ల విదేశీ మారకద్రవ్యం ఉంది. అంటే 46 లక్షల 48 వేల కోట్ల రూపాయలన్నమాట.మార్చి, ఏప్రిల్ నెలలో ఐదు వారాల పాటు తగ్గతూ వచ్చిన మారకద్రవ్యం.. ఇప్పుడు జూన్లో మళ్లీ మూడు వారాలు తగ్గింది.
ఫోరెక్స్ నిల్వలు తగ్గుతున్న కారణంగా ఇతర అంశాల్లోనూ వెనుకబడిపోయే పరిస్థితి కనిపిస్తోది. రూపాయి విలువ కూడా పడిపోతోంది. ప్రస్తుతం మనం ఒక డాలర్ కు 78 రూపాయలుపైగా సమర్పంచుకుంటేనే మనకు ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతోంది. బంగారం కూడా తగ్గిపోతోంది. మనకు దిగుమతులుచేసే దేశాలు కోరితే అనివార్యంగా బంగారం రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మరో వైపు భారత్ లో పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోతున్నారు. పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బులు తీసుకుంటున్నారు. ముడి చమురు దిగుమతి ధర ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది. మన దిగుమతి వ్యయంలో 32 శాతం చమురుకే వ్యయం చేయాల్సిన తరుణంలో విదేశీ మారక ద్రవ్యం మొత్తం ఖాళీ అవుతోందని ఆర్థిక వెత్తలు గగ్గోలు పెడుతున్నారు.
విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ ఉంటే దాని ప్రభావం పారిశ్రామికిరంగంపై కూడా పడుతుంది. చమురు, బొగ్గు దిగుమతులు, మెటల్స్, ఖనిజాలు, పారిశ్రామిక మాధ్యమిక ఉత్పత్తుల వ్యయాలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, బంగారం ధరలు కాస్త తగ్గే పరిస్థితి ఏర్పడినా రూపాయి విలువ క్షీణత కారణంగా వాటి ప్రత్యక్ష ప్రయోజనం సగటు వినియోగదారుడికి చేరే అవకాశం ఉండటం లేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మామూలు విషయం కాదు… అసలే భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది. అందుకే అందరూ మోదీ మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నారు.