అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ప్రపంచం అతలాకుతలం అయిపోతోంది. అయితే ఇది ఆయన కొట్టిన అతి పెద్ద దెబ్బ మాత్రం కాదు. ప్రాథమికంగా కొట్టిన దెబ్బలే. ఆయన బుర్రలో ఇంకా చిత్ర విచిత్రమైన ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. మెల్లగా అమలు చేస్తారు. ఈ లోపు అమెరికా దివాలా తీస్తుంది. అమెరికా అంటే ప్రపంచానికి మోజు తగ్గిపోతుంది.
సొంత ప్రజల్ని హింసిస్తున్న ట్రంప్
అమెరికన్లు ఓట్లేసి గెలిపించారు. సగం మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఉండవచ్చు కానీ.. ఆయన అందర్నీ కలిపి హింసిస్తున్నారు. సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారు. అర్హులైన వారికీ ఆపేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అంటే ట్రంప్ తన సొంత ఆస్తిగా భావిస్తున్నారు. అందుకే రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టేది లేదంటున్నారు. దీంతో ప్రజలు రోడ్డెక్కారు. ఈ నిరసనలు పెరిగినా చేసేదేమీ ఉండదు. నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా తిరుగులేని విధంగా ట్రంప్ అధికారం చెలాయిస్తారు. చేయాలనుకున్నది చేస్తారు.
అమెరికా నుంచి రాలేరు.. పోలేరు !
అమెరికాకు ఆదాయం తెచ్చిపెడుతున్న విదేశీ విద్యార్థులను ఆయన బలవంతంగా బయటకు పంపేసే ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ గా అన్ని పత్రాలతో వచ్చిన వారిని .. ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి కేసులు చూపించి దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. ఇక హెచ్ వన్ బీ వీసా దారులను ట్రంప్ వేధిస్తున్న వైనంతో వారికి కన్నీళ్లొస్తున్నాయి. కంపెనీలు.. ఎవరైనా సరే ఎంత పని ఉన్నా అమెరికా నుంచి పోవద్దని అంటున్నాయి. మళ్లీ రానివ్వరని వాటి నమ్మకం.
నాలుగేళ్లలో అమెరికా అన్ వాంటెడ్ కంట్రీ !
అమెరికా అంటే కాంప్లెక్స్అనే భావన ఉండేది. ఇప్పుడు అది పోయింది. రాను రాను అక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని అనుకుంటారు. ఈ నాలుగేళ్లలోనే అది జరుగుతుంది. ఆ దేశానికి వెళ్లే వాళ్లు తగ్గిపోతారు.. వెళ్లిపోయేవాళ్లు పెరుగుతారు. చదువు కోసం వెళ్లేవాళ్లూ ఆగిపోతారు. దాని వల్ల అమెరికాకు ఆదాయంతో పాటు ఉద్యోగాలూ పోతాయి. అమెరికాకు నష్టమే కానీ.. అమెరికా అంటే మోజు పడుతున్న వారికి అసలు నిజం తెలిసేలా చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇది ఒకందుకు మంచిదే అనుకోవచ్చు. ట్రంప్ నాలుగేళ్లలో అమెరికాను ఆప్ఘనిస్థాన్ చేసినా ఆశ్చర్యం ఉండదు.