వ్యక్తిగా నువ్ ఎలా ఉన్నా.. ఓ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మాత్రం అందరి గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. అది నాయకుడిలో ఉండాల్సిన మొదటి లక్షణం . కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వ్యక్తిగా ఎలా ఉంటానో.. అమెరికా అధ్యక్షుడిగా కూడా అలాగే ఉంటానని నిరూపిస్తున్నారు. ఫలితంగా అమెరికా నవ్వుల పాలవుతోంది. అగ్రరాజ్యం ఇంత చీపా అని అందరూ నవ్వుకునేలా మారుతోంది.
అబద్దాలు అదే పనిగా చెబుతున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏది మాట్లాడినా చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు ఆయనమాట్లాడితే ఏదీ సిరియస్ కాదు. అంతా జోకింగ్ గా మారుతోంది. ఇటీవల చైనాతో చర్చల గురించి ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారు. టారిఫ్లు ఏకపక్షంగా వేసింది ట్రంప్.. ఇప్పుడు ఆ టారిఫ్లపై చర్చలు జరుగుతున్నాయని చెప్పుకుంటోంది ఆయనే. అయితే చైనా మాత్రం ఆయన జోకర్ .. జోకులు వేస్తున్నారు.. టారిఫ్లపై అమెరికాతో చర్చలు లేవు.. జరగవు అని ప్రకటిస్తుంది. చివరికి చైనా అధ్యక్షుడితో తాను మాట్లాడానని ట్రంప్ చెప్పుకుంటే.. అలాంటిదేమీ లేదని చైనా వెంటనే స్పందించి పరువు తీసింది.
పరువు తీస్తున్న చైనా
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికా సంక్షోభంలోకి వెళ్లిపోతోంది. టారిఫ్లు ఏకపక్షంగా మార్చడం వల్ల ఎంత ఘోరమైన దెబ్బ అమెరికాకు తగులుతుందో అర్థమవుతోంది. అయితే దాన్ని డీల్ చేయాల్సిన పద్దతిలో డీల్ చేయకపోవడం వల్ల సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈగో సమస్యలతో అమెరికాను.. అక్కడి ప్రజల్ని ఆయన రాచి రంపాన్ని పెడుతున్నారు. బయట మాత్రమే కాదు.. అంతర్గతంగానూ ఆయన జోకర్ గా మారుతున్నారు.
బయటే కాదు అమెరికా ప్రజలకూ ట్రంప్ గండమే !
అమెరికాలో ట్రక్ డ్రైవర్లకు ఇంగ్లిష్ రావాలని ఓ రూల్ పెట్టారు. అమెరికా వాహన రంగంలో పంజాబీలు ఎక్కువగా ఉంటారు. ట్రక్ డ్రైవర్లలో పంజాబీలు ఎక్కువ. ఇప్పుడు వారికి ఇంగ్లిష్ రూల్ పెట్టారు ట్రంప్. చివరికి అమెరికన్లను ఆయన డ్రైవర్లు…క్లీనర్లుగా చేస్తున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు.. చేస్తున్న అవాస్తవపు ప్రకటనలతో అమెరికా ఇమేజ్ క్రమంగా మసకబారుతోంది.